ఒడిస్సా ప్రజలను ఒణికిస్తున్న ఓ వింత వ్యాధి

అసలే కోవిడ్ వచ్చి కోలుకోలేకుండా ఉన్నారు.. పుండు మీద కారం చల్లినట్టు మరో వింత వ్యాధి దాపురించి ఒడిస్సా వాసుల ప్రాణాలు హరిస్తోంది. నవరంగపూర్ జిల్లా కొశాగుమడ సమితిలోని బొడొ అటిగాం గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.. గత నాలుగైదు రోజుల్లో గ్రామంలోని 18 మంది ఈ వింత వ్యాధితో మరణించారు. ఈ మాయదారి రోగం ఎవర్ని మట్టుపెట్టుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మొత్తం గ్రామంలో 760 కుటుంబాలు నివసిస్తున్నాయి.
గత వారం రోజుల్లో ఏడాది వయసు నుంచి మొదలు 50 ఏళ్ల వయసున్న 18 మందికి జ్వరం, వాంతులు, విరోచనాలు రావడంతో అస్వస్థతకు గురై మరణించారు.. ఇదేం మాయరోగమో మనుషుల్ని ఇట్టా మట్టు పెడుతుందని తలపట్టుకుంటున్నారు.. వైద్యులు సైతం ఈ వింత వ్యాధి ఏమిటో గుర్తించలేకపోతున్నారు. ఈ వింత వ్యాధికి సంబంధించిన సమాచారం ప్రభుత్వ అధికారుల వద్ద లేనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జిల్లా ప్రధాన వైద్యాధికారి శోభారాణి దృష్టికి తీసుకువెళ్లడా వ్యాధిని గురించిన సమాచారం కానీ, మరణాల గురించి కానీ తమకు తెలియదని అన్నారు. ఒక వైద్య బృందాన్ని బొడొఅటిగాం గ్రామానికి పంపి పరిస్థితి తెలుసుకుంటామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com