Arya Rajendran : చరిత్ర సృష్టించిన మేయర్ ఆర్య..

Arya Rajendran : చరిత్ర సృష్టించిన మేయర్ ఆర్య..
ప్రస్తుతం బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్య రాజేంద్రన్ కుటుంబానికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు.

దేశంలోనే అతి చిన్న వయస్సులో మేయర్ అయిన వ్యక్తిగా ఆర్య రాజేంద్రన్(21 ఏళ్ల ) చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.. ఇటీవల కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచిన ఈమె ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. కలెక్టర్ నవజోత్ ఖోసా ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్య రాజేంద్రన్ కుటుంబానికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు.


చిన్నతనంలోనే ఆమె నాయకత్వ లక్షణాలను పుణికి పుక్చుకుంది. ముందుగా బాల సంఘానికి రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన ఆర్య రాజేంద్రన్.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదవన్‌ముకల్ వార్డుకు సీపీఎం అభ్యర్థిగా పోటిచేసి సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు.అయితే మేయర్‌ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగిన ఇద్దరు సీపీఎం నేతలు ఓడిపోవడంతో ఆర్య రాజేంద్రన్ పేరు తెరపైకి వచ్చింది. అగ్ర నాయకత్వం కూడా ఒకే చెప్పడంతో అతి చిన్న వయస్సులో మేయర్ అయిన వ్యక్తిగా ఈమె రికార్డు సృష్టించింది.

ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'నేను మేయర్‌గా కొనసాగుతూ.. నా చదువును కూడా కొనసాగిస్తాను' అని తెలిపింది. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మేయర్‌గా రికార్డు తెలంగాణకు చెందిన మేకల కావ్య పేరిట ఉంది. ఈమె 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌పై పోటీ చేసి గెలిచి 26 ఏళ్ల వయసులోనే మేయర్‌గా ఎన్నికయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story