కర్నాటకలో దారుణం.. ఆక్సిజన్ అందక 24 మంది కరోనా రోగులు మృతి

కర్నాటకలో దారుణం.. ఆక్సిజన్ అందక 24 మంది కరోనా రోగులు మృతి
ఆక్సిజన్ కొరత కరోనా రోగుల ప్రాణాలు తీస్తూనే ఉంది. కర్నాటకలోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఏకంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆక్సిజన్ కొరత కరోనా రోగుల ప్రాణాలు తీస్తూనే ఉంది. కర్నాటకలోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక ఏకంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. చామరాజనగర్‌లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. ప్రాణవాయువుపై చికిత్స పొందుతున్న రోగుల్లో ఒకేసారి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆక్సిజన్ అందకనే వారంతా మరణించారని రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. ఆక్సిజన్‌ ట్యాంకర్‌కు అధికారులు పర్మిషన్ ఇవ్వడంలో ఆలస్యం చేయడంతోనే ఇంత దారుణం జరిగిందని ఆరోపిస్తున్నారు.

అధికారులు మాత్రం అసలు ఆక్సిజన్‌ కొరతే లేదని వాదిస్తున్నారు. మైసూరు నుంచి ఆక్సిజన్ తెప్పించామంటున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే మరణాలకు కారణం తెలుస్తుందని చెప్తున్నారు. మరణించిన రోగులంతా వెంటిలేటర్‌పై ఉన్నవారేనని... అయితే వాళ్లకు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చామరాజనగర్ డిప్యూటీ కమిషనర్ MR రవి వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం యడియూరప్ప సీరియస్ అయ్యారు. ఆక్సిజన్ కొరతపై చర్చించడాని రేపు అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story