ఊబకాయంతో బాధపడుతున్నవారు రోజూ ఓ స్పూన్ నెయ్యి తింటే..

ఊబకాయంతో బాధపడుతున్నవారు రోజూ ఓ స్పూన్ నెయ్యి తింటే..
పరమాన్నానికి, పాయసానికి రుచిని అందించే నెయ్యి వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి..

వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయపచ్చడి, ఓ స్పూన్ నెయ్యి వేసుకుని కలిపి తింటే.. ఆహా ఎంత కమ్మగా ఉంటుంది.. ఆ రుచిని ఆస్వాదించని వారు బహుశా ఎవరూ ఉండరేమో.. పరమాన్నానికి, పాయసానికి రుచిని అందించే నెయ్యి వల్ల బోలెడు ఉపయోగాలు ఉన్నాయి.. ఊబకాయం ఉన్నవారు నెయ్యిని చూస్తే తినాలని ఉన్నా బొజ్జ మరింత పెరిగిపోతుందేమో అని భయపడుతుంటారు.. కానీ నెయ్యి తిని కూడా స్లిమ్ గా ఉండొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. వారు చెప్పిన నెయ్యితో 25 ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

దేశీ నెయ్యి తినడం వల్ల శరీర కొవ్వు స్థాయి పెరుగుతుందనేది ఒక అపోహ మాత్రమే అని అంటున్నారు. మన శరీరంలో రెండు రకాల కొవ్వులుంటాయి. అవి మంచి కొవ్వు, చెడు కొవ్వులు. మన శరీరానికి కొవ్వు అవసరం చాలా ఉంటుంది. కానీ అది కూడా అవసరమైన స్థాయిలోనే మంచి కొవ్వు వుండాలి. ఫాస్ట్ ఫుడ్ లు మన శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మరి నెయ్యి తీసుకుంటే ఏ వర్గం కొవ్వు వస్తుంది?

ఈ కొవ్వులను మోనోశాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అని శాస్త్రీయ పరిభాషలో పిలుస్తారు. భారీ పరిమాణంలో తీసుకుంటే హృదయ సంబంధ వ్యాధులకు దారితీయవచ్చు. కాబట్టి, మీరు నెయ్యిని తీసుకునే పరిమాణాన్ని బట్టి ఉంటుంది దాని ప్రయోజనం. వాటిలో కొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు.. ప్రతిరోజూ 1 టేబుల్ స్పూన్ నెయ్యి ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒకవేళ మీకు ఇప్పటికే హృదయసంబంధిత వ్యాధులు ఉంటే మొదట మీ వైద్యుడిని సంప్రదించి తీసుకోవాల్సి ఉంటుంది.

ఎక్కిళ్ళు.. ఎన్ని నీళ్లు తాగినా ఆగట్లేదంటే ఒక టీస్పూన్ గోరువెచ్చని నెయ్యి తినండి.. అది గొంతు నరాలను శాంతపరుస్తుంది దాంతో మీకు ఉపశమనం లభిస్తుంది. మరీ సన్నగా ఉన్నవారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే అలాంటి వాళ్లు చక్కెరతో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషణ అందుతుంది.. దాంతో సన్నగా ఉన్నా బలంగా ఉంటారు.

నాలుగు నల్ల మిరియాలు, చక్కెర ఒక స్పూను, చిన్న అల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్ల దేశీ నెయ్యి కలిపి బాగా దంచాలి. ఈ మిశ్రమాన్ని ఖాళీ కడుపుతో తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది.

బెల్లం తో గోరువెచ్చని నెయ్యి మిశ్రమాన్ని కలిపి తీసుకున్నా ఇది దగ్గు సిరప్ కంటే బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

రాత్రి పడుకునే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యితో 1 గ్లాసు గోరు వెచ్చని పాలు తీసుకోండి. ఇది పైల్స్ తో బాధపడుతున్నవారికి చక్కని ఔషధం.

పటిక బెల్లం పొడికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కలిపి తినడం వల్ల దృష్టి మెరుగుపడుతుంది.

రోజూ నెయ్యి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మీ శరీరంలో కొవ్వు పేరుకు పోకుండా చూస్తుంది.

నెయ్యిలో ఉన్న లినోలెయిక్ శరీర బరువుని తగ్గిస్తుంది.

నెయ్యిలో లభించే విటమిన్ కె మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

రోజూ దేశీ నెయ్యి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.

నెయ్యిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరం అంటువ్యాధుల బారిన పడకుండా ఉంటుంది.

నెయ్యి తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి.

మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్నవారు రెండు నాసికా రంధ్రాలలో 2 చుక్కల నెయ్యి వేసుకోవాలి. కొన్ని వారాలు ఇలా చేస్తుంటే ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుందంటారు ఆయుర్వేద వైద్యులు.

దేశీ నెయ్యి ఒమేగా 3, ఒమేగా 9 రకం కొవ్వు ఆమ్లాల సమ్మేళనం. ఇది పిల్లల పెరుగుదలకు తోడ్పడుతుంది.

మలబద్ధకంతో బాధపడేవారు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని 1 గ్లాసు గోరువెచ్చని పాలతో పడుకునే ముందు తీసుకోవాలి.

రోజుకు 4 సార్లు ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటే శరీరంలో ఉన్న మలిన పదార్థాలు బయటకు వస్తాయి.

మృదువైన చర్మానికి, జుట్టు ఊడకుండా ఉండేదుకు ఖాళీ కడుపుతో ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటే ఫలితం ఉంటుంది.

చపాతీ పిండిలో కాస్త నెయ్యి వేసి కలిపి చేస్తే అవి మృదువుగా రావడంతో పాటు వాటిని తింటే సులభంగా జీర్ణమవుతాయి.

బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా గర్భధారణ సమయంలో నెయ్యి తినడం మానేయలేదని వెల్లడించారు. కరీనా వాస్తవానికి తన గర్భధారణ సమయంలో పెరిగిన బరువు తగ్గడానికి నెయ్యి సహాయపడిందని చెప్పింది. నెయ్యి వాడకం వల్ల బరువు పెరుగుతామని అనుకునే వారికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఎక్కువ పరిమాణంలో నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతారనేది వాస్తవం. ఏదైనా మితంగా వాడితేనే దాని వలన ప్రయోజనం ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story