Trains Cancelled: కోవిడ్ ఎఫెక్ట్.. 28 రైళ్లు రద్దు

Trains Cancelled: కోవిడ్ ఎఫెక్ట్.. 28 రైళ్లు రద్దు
ఈ నేపథ్యంలో రైళ్లను ఈ నెల 30వ తేదీ వరకు రద్దు చేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చింది రైల్వే శాఖ.

Trains Cancelled: లాక్టౌన్ వల్ల బయటకు వెళ్లే అవకాశం లేదు. ఇక ఊరెళ్లాలంటే మరింత కష్టం. అయినా ఎవరింటి వెళ్దామన్నా వాళ్లూ మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోతున్నారు. మనమూ ధైర్యం చేసి వెళ్లలేకపోతున్నాం. దీంతో ఎందుకొచ్చిన గొడవ అని ఎక్కడి వారక్కడ ఉండిపోతున్నారు. ఈ క్రమంలో రైల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా బాగా తగ్గు ముఖం పట్టింది. ఈ నేపథ్యంలో రైళ్లను ఈ నెల 30వ తేదీ వరకు రద్దు చేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చింది రైల్వే శాఖ. ఏఏ ట్రైన్స్ రద్దయ్యాయి.. ఆయా వివరాలేంటో చూద్దాం..

ట్రైన్ నెం. 02708: తిరుపతి నుంచి విశాఖపట్నం మధ్య నడిచే ఈ ట్రైన్ ఈ నెల 7 నుంచి 30 వరకు రద్దు చేశారు.

ట్రైన్ నెం. 02707: విశాఖపట్ంనం నుంచి తిరుపతి మధ్య నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 8 నుంచి 31 వరకు రద్దు చేశారు.

ట్రైన్ నెం. 07023: సికింద్రాబాద్ నుంచి కర్నూల్ సిటీ మధ్య నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 7 నుంచి 31 వరకు రద్దు చేశారు.

ట్రైన్ నెం. 02775: కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 09 నుంచి 30 వరకు రద్దు చేశారు.

ట్రైన్ నెం. 02776: లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 10 నుంచి 31 వరకు రద్దు చేశారు.

ట్రైన్ నెం. 07249: కాకినాడ టౌన్ నుంచి రేణిగుంట వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 31 వరకు రద్దు చేశారు.

ట్రైన్ నెం. 07250: రేణిగుంట నుంచి కాకినాడ టౌన్ వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 8 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు రద్దు చేశారు.

ట్రైన్ నెం. 02795: విజయవాడ నుంచి లింగంపల్లి వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 7 నుంచి 31 వరకు రద్దు చేశారు.

ట్రైన్ నెం. 02796: లింగం పల్లి నుంచి విజయవాడ వరకు నడిచే ఈ ట్రైన్ ను ఈ నెల 8 నుంచి వచ్చే నెల 1 వరకు రద్దు చేశారు.

ట్రైన్ నెం. 02762: కరీంనగర్ నుంచి తిరుపతి మధ్య నడిచే ట్రైన్ ను ఈ నెల 09 నుంచి 30 వరకు రద్దు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story