Chennai : చెన్నై మేయర్‌గా తొలి దళిత మహిళ..ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Chennai : చెన్నై మేయర్‌గా తొలి దళిత మహిళ..ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
Chennai : చెన్నై నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఓ దళిత మహిళ మేయర్ గా ఎంపికయ్యారు

Chennai : చెన్నై నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఓ దళిత మహిళ మేయర్ గా ఎంపికయ్యారు.అధికార డీఎంకే పార్టీకి చెందిన ఆర్ ప్రియ మొట్టమొదటి దళిత మేయర్‌గా ఈరోజు(శుక్రవారం) ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా అతి పిన్నయస్కురాలిగా కూడా ఆమె రికార్డుల్లోకెక్కారు.

చెన్నై చరిత్రలో తారా చెరియన్, కామాక్షి జయరామన్ తర్వాత ఈ పదవిని చేపట్టిన మూడో మహిళ ఈమె కావడం విశేషం. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 21 ఏండ్ల ప్రియదర్శిని తీనాంపేట 98వ వార్డు నుంచి గెలుపొందారు.

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ లో మొత్తం 200 వార్డులు ఉండగా.. డీఎంకే 153 స్థానాల్లో విజయం సాధించింది. అన్నాడీఎంకే 15, కాంగ్రెస్‌ 13, ఇండిపెండెట్లు 5, సీపీఎం 4, వీసీకే 4, బీజేపీ 1 స్థానం చొప్పున గెలుపొందాయి. ఇక ప్రియ ఎవరో కాదు.. డీఎంకే మాజీ ఎమ్మెల్యే చెంగై శివం మనవరాలు.

చెన్నైలో పుట్టి పెరిగిన ప్రియ.. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ కాలేజీ ఫర్ ఉమెన్‌లో ఎంకామ్ పూర్తి చేసింది. గత ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడంతో రాజకీయాలపై తనకున్న ఆసక్తి పెరిగిందని, పొరుగువారికి సహాయం చేయాలనే మక్కువ ఎక్కువైందని ప్రియ చెప్పుకొచ్చింది.


Tags

Read MoreRead Less
Next Story