సర్పంచ్ పదవి కోసం 45 ఏళ్ల వయసులో పెళ్లి...!

సర్పంచ్ పదవి కోసం 45 ఏళ్ల వయసులో పెళ్లి...!
బాలియా జిల్లాలోని కరణ్‌‌చప్రా గ్రామానికి చెందిన హథీసింగ్ (45) అనే వ్యక్తి.. చాలా కాలంగా ప్రజాసేవ చేస్తున్నాడు. ప్రజాసేవ చేయడం కోసం ఏకంగా పెళ్లి చేసుకోవడం కూడా మానేశాడు.

ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి సర్పంచ్ పదవి కోసం 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. బాలియా జిల్లాలోని కరణ్‌‌చప్రా గ్రామానికి చెందిన హథీసింగ్ (45) అనే వ్యక్తి.. చాలా కాలంగా ప్రజాసేవ చేస్తున్నాడు. ప్రజాసేవ చేయడం కోసం ఏకంగా పెళ్లి చేసుకోవడం కూడా మానేశాడు. అయితే గత ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసిన విజయం దక్కలేదు.. అయితే ఈసారి పోటీ చేద్దామంటే ఆ గ్రామం మహిళకి రిజర్వు చేశారు.

సహచరుల సూచనతో ముహురాన్ని కూడా పక్కన పెట్టి వెంటనే డిగ్రీ చదివిన ఓ యువతిని మార్చి 26న వివాహం చేసుకున్నాడు. కాగా కరణ్ చప్రా గ్రామానికి ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 13 లోపు నామినేషన్ సమర్పించాలి. అందుకే వెంటనే పెళ్లి చేసుకున్నాడు. అయితే కేవలం గ్రామ అభివృద్ధి కోసమే పెళ్లి చేసుకున్నట్టుగా హథీసింగ్ చెప్పుకొచ్చాడు. కచ్చితంగా హధీసింగ్ భార్యనే గెలిపిస్తామని గ్రామస్థులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story