థ్యాంక్యూ సో మచ్ అబ్బాయ్.. గూడు కట్టుకోవడానికి చాలా హెల్ప్ చేశావు.. వీడియో

థ్యాంక్యూ సో మచ్ అబ్బాయ్.. గూడు కట్టుకోవడానికి చాలా హెల్ప్ చేశావు.. వీడియో
ఎవరైనా మహానుభావుడు హెల్ప్ చేస్తే బావుండని మా ఇంటాయన, నేనూ రాత్రే మాట్లాడుకున్నాం..

మిమ్మల్ని చూసి మేం కూడా మారిపోయాం.. ఏడంతస్తుల మేడని కూడా ఎంత ఈజీగా కట్టేస్తారు వందల మంది కూలీలను పెట్టేసి.. మేం మాత్రం మా చిన్ని గూడును కట్టుకోవాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి.. ఎన్ని పుల్లలు ఏరుకురావాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కష్టపడి కట్టుకున్న గూడు నేల రాలిపోతుంది. ఎవరైనా మహానుభావుడు హెల్ప్ చేస్తే బావుండని మా ఇంటాయన, నేనూ రాత్రే మాట్లాడుకున్నాం..

దేవుడు మా మొర ఆలకించినట్టున్నాడు.. ఉదయానికల్లా ఓ బుజ్జిగాడు మా గూడు కట్టుకోవడానికి చేయందించాడు.. పుల్లలు తెచ్చి ఇచ్చాడు.. ఏంచక్కా మా అందాల పొదరిల్లు అరగంటలో సిద్దమైపోయింది.. అందులో వెచ్చగా గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు చేసుకోవచ్చిని బాతు సంబరపడిపోతోంది.

ఆడుకుంటూ అటుగా వచ్చిన ఆ పిల్లాడికి బాతు గూడు కట్టుకోవడానికి పడుతున్న కష్టం, పుల్లలేరి తీసుకువస్తున్న వైనం చూసి బాతుకు సహాయం చేయాలనుకున్నాడు. వెంటనే ఒక్కో పుల్లా తీసుకువచ్చి బాతుకు అందించాడు.. వెంటనే బాతు కూడా ఏనాటి ఈ బంధం ఈనాటితో అన్నట్టు వాడందించే పుల్లలు తీసుకుని చకచకా ఇల్లు కట్టేసుకుంది. ఎక్కడ జరిగిందో తెలియకపోయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడముచ్చటగా ఉంది. కాసేపు చూడ్డానికి ఎంతో బావుంది.. మీరూ ఓ లుక్కేయండి మరి.

Tags

Read MoreRead Less
Next Story