ప్రేమించాడు.. పెళ్ళికి నో అన్నాడు... ఒక్క కేసుతో పెళ్ళైపోయింది...!

ప్రేమించాడు.. పెళ్ళికి నో అన్నాడు... ఒక్క కేసుతో పెళ్ళైపోయింది...!
ఓ యువతిని ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించాడు. కానీ చివరికి మొఖం చాటేశాడు. అయితే ఒక్క కేసుతో ఆ అమ్మాయి మేడలో మూడు ముళ్ళు వేశాడు.

ఓ యువతిని ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించాడు. కానీ చివరికి మొఖం చాటేశాడు. అయితే ఒక్క కేసుతో ఆ అమ్మాయి మేడలో మూడు ముళ్ళు వేశాడు. ఈ ఘటన ఛత్తీస్​గడ్​లోని కాంకేర్​ జిల్లాలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దీపక్​అనే వ్యక్తి.. ఓ 22 ఏళ్ల యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

అనంతరం మొండికేశాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టిన ససేమిరా అన్నాడు. చివరికీ ఆ యువతి అతడిపై పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతిని మోసగించిన కేసులో 2020 నవంబర్​2 న అతన్నీ అరెస్ట్ చేసి.. కాంకేర్​ జిల్లా జైల్లో ఉంచారు.

ఇక అప్పటినుంచి జైల్లోనే ఉంటున్న దీపక్.. ఆ యువతితో ఎట్టకేలకు పెళ్లికి అంగీకరించాడు. వివాహానికి అనుమతి కోరుతూ.. కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు వారిద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేయగా..పండితులు, జైలు అధికారుల మధ్య వివాహం జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story