రాజకీయాల్లోకి హీరో విజయ్‌.. పార్టీ పేరు..?

రాజకీయాల్లోకి హీరో విజయ్‌.. పార్టీ పేరు..?
X

తమిళనాడు రాజకీయాల్లో సినీతారల సందడి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ నటీనటులు తమిళనాట రాజకీయాల్లోకి అడుగుపెట్టగా... తాజాగా ఆ జాబితాలో మరో పేరు చేరనున్నట్టు తెలుస్తోంది. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హీరో విజయ్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తమిళనాట ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘంలో పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్టు కూడా తెలుస్తోంది.

మరోవైపు... ఈ ప్రచారాన్ని హీరో విజయ్‌ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే.. పార్టీ వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తమిళ సినీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై.. విజయ్ పీఆర్‌ఓ టీం స్పందించింది. ఈ వార్తలన్నీ అవాస్తమని ట్విటర్‌ వేదికగా స్పష్టం చేసింది. ' ఎలక్షన్‌ కమిషన్‌ వద్ద దళపతి విజయ్‌.. తన రాజకీయపార్టీని రిజిస్టర్‌ చేయించారంటూ వస్తున్న వార్తలు నిజం కాదని'.. విజయ్‌ పీఆర్‌ఓ రియాజ్‌ అహ్మద్‌ ట్వీట్‌ చేశారు.Next Story

RELATED STORIES