Aditya Sawant: 25 ఏళ్ల కుర్రాడు.. రూ.25 లక్షల సంపాదన.. 22 కోట్ల నెట్ వర్త్..

Aditya Sawant: సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ.. టెక్నాలజీనే మన లైఫ్‌ను చాలా మర్చేస్తుంది.

dynamo gaming (tv5news.in)
X

dynamo gaming (tv5news.in)

Aditya Sawant: సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ.. టెక్నాలజీనే మన లైఫ్‌ను చాలా మర్చేస్తుంది. ఈ టెక్నాజీని చెడుకి ఉపయోగించేవారే ఎక్కువగా ఉన్నా.. మంచికి ఉపయోగించి లైఫ్‌లో సక్సెస్ అవుతున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారి గురించి మనం రోజూ పేపర్లో, టీవీల్లో చూస్తూనే ఉంటాం. తాజాగా ఆ లిస్ట్‌లోకి చేరాడు ఓ 25 ఏళ్ల ముంబాయ్ కుర్రాడు.

సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేసేవారు ఉన్న ఈ రోజుల్లో అదే సోషల్ మీడియాను నమ్ముకుని లక్షలు సంపాదిస్తున్నవారు కూడా ఉన్నారు. అందులోనూ డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలను ఇస్తున్న ఒక యాప్ యూట్యూబ్. దాని ద్వారానే డైనమో గేమింగ్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను పెట్టి నెలకు రూ.25 లక్షలు పైగా సంపాదిస్తున్నాడు ఆదిత్య సావంత్.

వీడియో గేమ్స్ ఆడేవారు అందరూ సరదాకి ఏం ఆడరు. అందులో కొందరు ఆ గేమింగ్‌నే తమ కెరీర్‌గా ఎంచుకోవాలి అనుకుంటారు. అదే చేశాడు ఆదిత్య సావంత్. అతను ఒక నేషనల్ గేమర్. ఇతనికి ఇంకొక పేరు కూడా ఉంది, అదే డైనమిక్ గేమర్. యూట్యూబ్ స్ట్రీమింగ్‌లో, గేమింగ్‌లో ఆదిత్య ఇదే పేరుతో పాపులర్. ఆదిత్య పబ్‌జీ మొబైల్(PUBG)లో స్నైపర్ గా ప్రసిద్ధి చెందాడు. అతను అంతర్జాతీయ వేదికపై మనదేశం తరుపున ప్రాతినిధ్యం వహించాడు. ఆదిత్య సావంత్ తన యూట్యూబ్ గేమింగ్ చానెల్ డైనమో గేమింగ్ ద్వారా నెలకు రూ.25 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు. డైనమో గేమింగ్ నెట్ వర్త్ 3 మిలియన్ డాలర్లు (రూ.22 కోట్లు).

Next Story

RELATED STORIES