Ahmedabad: ప్రేమగా పెంచుకున్న కుక్కను కోల్పోయాడు.. అందుకే కుక్కల కోసం..

Ahmedabad: ప్రేమగా పెంచుకున్న కుక్కను కోల్పోయాడు.. అందుకే కుక్కల కోసం..
Ahmedabad: కొంతమందికి కుక్కలంటే చాలా ఇష్టం. పెంపుడు కుక్కల్ని కొందరు ఇంట్లో సభ్యుల్లాగే ట్రీట్ చేస్తుంటారు.

Ahmedabad: కొంతమందికి కుక్కలంటే చాలా ఇష్టం. పెంపుడు కుక్కల్ని కొందరు ఇంట్లో సభ్యుల్లాగే ట్రీట్ చేస్తుంటారు. అవి కూడా మనపట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయి. ఇంత ప్రేమగా చూసుకునే ఆ కుక్క.. అనుకోకుండా మనకు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. ఇలాంటి ఘటనే గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన శైవల్ దేశాయ్ కి ఎదురైంది. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ఏడాది కిందట తన పెంపుడు కుక్క చనిపోయింది.

ఆ దుర్ఘటన శైవల్ ని తీవ్రంగా కలచివేసింది. అనారోగ్యంతో ఏ కుక్క చనిపోకూడదని ఇక అప్పుడే నిశ్చయించుకున్నాడు. దాని ఫలితమే ఇవాళ అహ్మదాబాద్ లోని 'బెస్ట్ బడ్స్ పెట్ హాస్పిటల్'. కుక్కల కోసం అత్యాధునిక సౌకర్యాలు, అనుభవజులైన డాక్టర్లతో హాస్పిటల్ ను ప్రారంభించాడు దేశాయ్. ఎంతటి అనారోగ్య సమస్య అయినా సరే ఇక్కడ పరిష్కారం అవ్వాల్సిందే. దేశంలో మొట్టమొదటిసారిగా జంతువుల కోసం వెంటిలేటర్ ను కూడా ఈ హాస్పిటల్లో వాడుతున్నారు

Tags

Read MoreRead Less
Next Story