Air India : బెయిల్ వద్దని జైలుకు వెళ్లాడు

Air India : బెయిల్ వద్దని జైలుకు వెళ్లాడు
IPC సెక్షన్ కింద చెల్లించాల్సిన జరిమానా రూ. 250 అని తాను ఆన్‌లైన్లో రిసెర్చ్ చేశానని చెప్పాడు. ఈ విషయాన్ని కోర్టుకు తెలిపాడు

ఎయిర్ ఇండియా విమానంలో ధూమపానం చేస్తూ పట్టుబడిన ఓ వ్యక్తికి జైలు శిక్ష విధించింది కోర్టు. బెయిల్ కోసం అప్లై చేసుకోవచ్చని అందుకు రూ.25వేలను చెల్లించాలని, అప్పుడే బెయిల్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. అందుకు సదరు వ్యక్తి బెయిల్ ను తిరస్కరించాడు. ఆపై, జైలుకు వెళ్లాడు.

రత్నాకర్ ద్వివేది అనే వ్యక్తి మార్చి 10న లండన్ నుంచి ఇండియాకు వస్తున్న ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తున్నాడు. విమానంలోని లావేటరీలో దూమపానం చేస్తూ వికృతంగా ప్రవర్తించసాగాడు. విమాన సిబ్బంది వారించగా ఎదురు తిరిగాడు. పైలట్ హెచ్చరికలను పెడచెవిన పెట్టాడు. నియమాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రయాణికులందరి ప్రాణాలకు హానికలిగించాడు. విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా ముంబై పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు.

ఎయిర్ ఇండియా విమానంలో వికృత ప్రవర్తన, ధూమపానం చేశాడని అభియోగాలు మోపబడిన రత్నాకర్ ద్వివేదిని ముంబై లోని అంధేరీ మెట్రోపాలిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. బెయిల్ కు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. అందుకు చెల్లించాల్సిన మెత్తం రూ. 25,000లని పేర్కొంది. బెయిల్ కోసం డబ్బులు చెల్లించడానికి సదరు వ్యక్తి నిరాకరించాడు. అందుకు బదులుగా IPC సెక్షన్ 336 కింద చెల్లించాల్సిన జరిమానా రూ. 250 అని తాను ఆన్‌లైన్లో రిసెర్చ్ చేశానని చెప్పాడు. ఈ విషయాన్ని కోర్టుకు తెలిపాడు. దీంతో అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సోమవారం అతడిని జైలుకు పంపారు.

Tags

Read MoreRead Less
Next Story