రూ. 4వేలకే స్మార్ట్‌ ఫోన్.. జియో కొత్త బిజినెస్ ప్లాన్

రూ. 4వేలకే స్మార్ట్‌ ఫోన్.. జియో కొత్త బిజినెస్ ప్లాన్
దీన్నే తన బిజినెస్‌‌కి అనుకూలంగా మార్చుకున్నారు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ.

ఆన్‌లైన్ క్లాసులు.. అమ్మాయికి, అబ్బాయికి ఇద్దరికీ ఫోన్ కొనాలంటే అయ్యే పనేనా. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడమే కష్టమనుకుంటే ఒక్కొక్కరికి ఒక్కో ఫోనంటే ఎక్కడ తెచ్చేది. దీన్నే తన బిజినెస్‌‌కి అనుకూలంగా మార్చుకున్నారు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ. భారత మొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ముఖేశ్ 'జియో స్మార్ట్‌ఫోన్' పై దృష్టి సారించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెండేళ్లలో 20 కోట్ల స్మార్ట్‌ఫోన్లను దేశీయంగా తయారు చేయించాలని నిర్ణయించారు. స్మార్ట్‌ఫోన్ కొనలేని 50 కోట్ల మంది చేతిలో 'జియో స్మార్ట్‌ఫోన్' ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

మార్కెట్ లో ప్రస్తుతం ఖరీదైన సెల్ ఫోన్ లు ఉన్నాయని, చవకైన ఫోన్లను అందించాలని రిలయెన్స్ జియో భావిస్తోంది. కేవలం రూ. 4వేల ధర ఉండాలని నిర్ణయించింది. కానీ ఒక్కసారే అన్ని ఫోన్లను తయారు చేసే కెపాసిటీ దేశీయ తయారీ దారులకు సాధ్యంకాదని భావించి రెండేళ్లలో 20 కోట్ల ఫోన్ల తయారీపై దృష్టి సారించారు. అంబానీ తాజా నిర్ణయం ఫోన్ తయారీ దారులకు ఊతమిచ్చినట్లవుతుందని ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మొహింద్రు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story