భారత ప్రభుత్వంపై ఆమ్నెస్టీ సంచలన వ్యాఖ్యలు

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ.. భారత ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తమ విషయంలో అప్రజాస్వామికంగా వ్యవహరించిదని ఆరోపించింది. తమ బ్యాంకు ఖాతాలన్ని 2020 సెప్టెంబర్ 10న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా స్తంభింపజేసిందని.. ఇకపై భారత్ లో తమ కార్యకలాపాలు నిర్వహించలేమని స్పష్టం చేసింది. అవాస్తవాలు, ఉద్దేశపూరక ఆరోపణలపై మానవ హక్కుల సంస్థలను భారత ప్రభుత్వం మంత్ర గత్తెలా వేటాడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రభుత్వం ప్రతీకార చర్యల కారణంగానే తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నామని మంగళవారం ప్రకటింది. దేశంలో జరిగిన మానవహక్కుల ఉల్లంఘనలపై పలు నివేదికలు ఇచ్చామని.. ఈ నేపథ్యంలో తమ సభ్యులు.. బెదిరింపులు, వేధింపులకు గురవుతున్నారని గ్రూప్ సీనియర్ రీసెర్చ్, అడ్వకేసీ అండ్ పాలసీ డైరెక్టర్ రజత్ ఖోస్లా చెప్పారు. ఢిల్లీ అల్లర్లు, జమ్ముకశ్మీర్ అంశాలపై ప్రభుత్వం మౌనం వహించిదని ఆరోపించారు. 70కి పైగా దేశాలలో పనిచేస్తున్నామని.. ఒక్క రష్యాలో తప్ప ఇంతకముందు మరెక్కడా తమ కార్యకలాపాలను మూసివేయలేదని ఖోస్లా చెప్పారు. అయితే తమపై ఉన్న కేసుల విషయంలో చట్టపరంగా పోరాటం సాగిస్తామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com