కోటి రూపాయల క్వశ్చన్‌కి ఆన్సర్.. ఆమె ధైర్యం చేసి..

కోటి రూపాయల క్వశ్చన్‌కి ఆన్సర్.. ఆమె ధైర్యం చేసి..
'నైటింగేల్ ఆఫ్ ఇండియా' అని పిలువబడే సరోజిని నాయుడు తన ప్రసిద్ధ నాటకం మహేర్ మునీర్ ను ఏ భాషలో రాశారని ఆమెను

కౌన్ బనేగా కరోడ్ పతి.. హాట్ సీట్లో అమితాబ్ ముందు కూర్చోడమే అదృష్టంగా భావిస్తారు పార్టిసిపెంట్స్.. ఇక ఆయన అడిగే ప్రశ్నలు తికమక పెట్టినా సరైన సమాధానం చెబితే సంతృప్తి.. పేరు, డబ్బూ అన్నీ వస్తాయి. కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లే అదృష్టం కొందరినే వరిస్తుంది.. ఈ సారి ఆ అవకాశం దక్కించుకున్నారు ఢిల్లీకి చెందిన ఛవికుమార్.. బిగ్ బీ అమితాబ్ హోస్ట్‌గా కొనసాగుతున్న కేబీసీ 12వ సీజన్ కొనసాగతోంది.

ఈ షో ద్వారా తమ నాలెడ్జ్‌ని, తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారెందరో. ఛవికుమార్ కూడా రూ.50 లక్షలు గెలుచుకున్నారు అప్పటి వరకు అమితాబ్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చెప్పి.. కానీ అక్కడి నుంచి అసలైన ఆట ఆ తరువాత వేసే ప్రశ్నే కోటి రూపాయలు తెచ్చి పెట్టేది. పక్కాగా తెలిస్తేనే చెప్పాలి.. లేదంటే అప్పటి వరకు సంపాదించుకున్న రూ.50 లక్షలు పోయి రూ.3లక్షల 20 వేలు మాత్రమే వస్తాయి. ఆమె ఆలోచించారు.. ఆన్సర్ సరిగా తెలియదు.. వెంటనే క్విట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.. సరే.. ఎలాగూ ఆట విరమించుకున్నారు కాబట్టి ఆన్సర్ గెస్ చేయండి అన్నారు అమితాబ్..

ఆయన అడిగిన ప్రశ్న.. 2024లో చంద్రునిపైకి ఒక మహిళను, ఒక పురుషుడిని పంపించడానికి అమెరికా చేపట్టిన ఒక స్పేస్ ప్రొగ్రామ్‌కు గ్రీక్ దేవత పేరు పెట్టారు. అది ఏమిటి? దీనికి నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. రియా, నెమెసిస్, ఆఫ్రొడైట్, ఆర్టెమిస్ అని.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అప్పటికే లైఫ్‌లైన్స్ అన్నింటినీ ఉపయోగించుకున్నారు. ఇక ఆ అవకాశం కూడా లేదు. దాంతో ఆట నుంచి తప్పుకున్నారు. ఇంతకీ ఛవి కుమార్ చేసిన ఆన్సర్ రియా.. అది తప్పు కావడంతో ఆమె మంచి పని చేశానని ఊపిరి పీల్చుకున్నారు. రూ .50 లక్షల ప్రశ్నకు సమాధానాన్ని చావి సరిగ్గా ఊహించారు.

'నైటింగేల్ ఆఫ్ ఇండియా' అని పిలువబడే సరోజిని నాయుడు తన ప్రసిద్ధ నాటకం మహేర్ మునీర్ ను ఏ భాషలో రాశారని ఆమెను అడిగారు. ఆప్షన్స్ ఉర్దూ, ఇంగ్లీష్, పర్షియన్, తెలుగు. ఎటువంటి లైఫ్‌లైన్స్ మిగిలి లేనప్పటికీ, ఛావి గెస్ చేసి చెప్పారు. ఆమె సమాధానం పర్షియన్‌. సరోజి నాయుడు రాసిన మహేర్ మునీర్ హైదరాబాద్ నిజాంను ఆకట్టుకుంది. ఆ గౌరవంతోనే అతను సరోజినికి విదేశాలలో చదువుకోవడానికి స్కాలర్‌షిప్ ఇప్పించారు.

Tags

Read MoreRead Less
Next Story