అక్టోబర్ 5 నుంచి బడికెళ్లాలోచ్..

అక్టోబర్ 5 నుంచి బడికెళ్లాలోచ్..
ఈ విద్యాసంవత్సరం నుంచే 5+3+3+4 విధానాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.

ఇంతకు ముందు బడికెళ్లను అంటే అమ్మ చీపురు కట్ట తిరగేసేది.. ఇప్పుడు పిల్లలని బడికి పంపించాలంటేనే అమ్మకి భయమేస్తుంది.. కోవిడ్ వచ్చి పిల్లల్ని బడికి వెళ్లకుండా చేసింది.. ఆట పాటలన్నీ అటక మీద పెట్టేశారు. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో మొబైల్స్, ల్యాప్ టాప్ ల ముందే రోజంతా గడిపేస్తున్నారు ప్రతి ఇంట్లో పిల్లలు. ఎట్టకేలకు అక్టోబర్ నుంచి బడి ప్రారంభించాలని ఏపీ సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చింది. కోవిడ్ నిబంధనలను అనుసరించి బడి బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు విద్యార్థులు. అయితే 9,10, ఇంటర్ మీడియట్ విద్యార్థులకు మాత్రమే రెగ్యులర్ తరగతులు చేపట్టాలని భావిస్తోంది.

సీబీఎస్‌ఈ తరహాలో సిలబస్‌లో కూడా మార్పులు చేపడతామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థులు తమకి ఉన్న డౌట్లు క్లియర్ చేసుకోవాలసి ఉంటుందని స్పష్టం చేశారు. అదే విధంగా యాభై శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే స్కూళ్లకు హాజరవుతారన్నారు. నూతన విద్యావిధానం ప్రకారం.. 2020-21 విద్యాసంవత్సరం నుంచే 5+3+3+4 విధానాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. స్కూళ్లకు అనుబంధంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ముందుగా ఎల్‌కేజీ, యూకేజీలను ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. టీచర్లకు త్వరలో వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియను చేబడుతామని మంత్రి సురేష్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story