Anna Rajam Malhotra : తొలి మహిళా IAS ఆఫీసర్ ఎవరో తెలుసా?

Anna Rajam Malhotra : తొలి మహిళా IAS ఆఫీసర్ ఎవరో తెలుసా?
Anna Rajam Malhotra : మనదేశంలో తొలి మహిళా IPS అంటే అందరికి టక్కున గుర్తొచ్చేది కిరణ్ బేడినే.. మరి తొలి మహిళా IAS అంటే కొద్దిసేపు అలోచించాల్సిందే.

Anna Rajam Malhotra : మనదేశంలో తొలి మహిళా IPS అంటే అందరికి టక్కున గుర్తొచ్చేది కిరణ్ బేడినే.. మరి తొలి మహిళా IAS అంటే కొద్దిసేపు అలోచించాల్సిందే. ఆమె ఎవరో కాదు.. అన్నా రాజం మల్హోత్రా.. ఆమె కేరళలోని నిరనం, అలెప్పీ లో 1927 జూలై 17న ఒట్టావెల్లి ఓ.ఎ.జార్జి, అన్నాపౌలి దంపతులకు జన్మించింది. ఆమె మలయాళం రచయిత "పాలియో పాల్" కు మనుమరాలు. సివిల్ సర్వీస్‌లో 1951లో చేరిన ఆమె.. మొట్టమొదటగా మద్రాస్‌ స్టేట్‌లో సేవలందించారు. అప్పటి సీఎం సీ. రాజగోపాలచారి ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వ పలు శాఖల్లోనూ ఆమె కీలక బాధ్యతలు నిర్వర్తించారు

1985 నుంచి 1990 వరకు ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన ఆర్.ఎన్.మల్హోత్రా ఆమె పెళ్లి చేసుకుంది. . మొదటిసారి హోసూరు సబ్ కలెక్టర్‌గా చేసింది. ఏడుగురు ముఖ్యమంత్రుల వద్ద ఆమె ఆఫీసర్‌గా చేసింది. ఆమె హోసూరు సబ్ కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఓ గ్రామంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తోన్న ఆరు ఏనుగులపై కాల్పులకు ఆదేశాలివ్వాలని ఒత్తిడి వచ్చినా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నది. గజరాజులను సురక్షితంగా అడవికి వెళ్లేలా చేసింది. ముంబైలో జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌పీటీ)ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించింది.

ఆ ట్రస్ట్‌కు ఆమె చైర్‌పర్సన్‌గా కూడా వ్యవహరించింది. 1982లో ఢిల్లీలో ఏసియన్ గేమ్స్ నిర్వహించినప్పుడు వాటి వ్యవహారాలను ఆమెనే చూశారు. ఈ సమయంలో ఆనాటి ప్రధాని రాజీవ్‌గాంధీతో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది. కేంద్ర హోంశాఖలోనూ కీలక పదవులు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వంలో సెక్రటేరియల్ ఉద్యోగాన్ని నిర్వహించిన మొదటి మలయాళీ మహిళగా గుర్తింపు పొందింది. 1989లో ఆమెకు పద్మ భూషణ్ అవార్డు వచ్చింది. 91 ఏళ్ల వయసులో 2018లో ఆమె మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story