Assam: పెళ్లి ఆగిపోయిందని బాలిక ఆత్మహత్య

Assam: పెళ్లి ఆగిపోయిందని బాలిక ఆత్మహత్య
అస్సామ్ లో బాల్యవివాహాలపై ప్రభుత్వం ఉక్కుపాదం; పెళ్లి ఆగిపోయిందని 17ఏళ్ల బాలిక ఆత్మహత్య...

అస్సామ్ ముఖ్యమంత్రి బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో చిన్నారి పెళ్లి కూతుర్ల నుంచి ప్రభుత్వానికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయి. బాల్యవివాహాలను అడ్డుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న దాడుల్లో సుమారు 2500 మందిని అరెస్ట్ చేసిన నేపథ్యంల ో ఓ బాలిక తన పెళ్లి రద్దు అయిందని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడంతో ఖంగు తినడం అధికారుల వంతు అయింది. తాజా పరిణామాల నేపథ్యంలో తాను ప్రేమించిన వ్యక్తితో తల్లిదండ్రులు వివాహాన్ని రద్దు చేయడంతో 17 ఏళ్ల బాలిక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. కాస్ పుర్ గ్రామంలోని రాజ్ నగర్ పంచాయితి పరిథికి చెందిన బాలిక, తనకన్నా వయసులో పెద్దవాడైన వ్యక్తిపై మనసు పడటంతో ఆమెను అతడికే ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఓ వైపు ప్రభుత్వం బాల్యవివాహాలను రద్దు చేస్తూ వరుస దాడులు చేస్తుండటంతో భయపడిన తల్లిదండ్రులు ఆమె వివాహాన్ని రద్దు చేశారు. దీంతో మనస్థాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. మరో ఘనలో 23ఏల్ల మహిళ తన భర్త, తండ్రి అరెస్ట్ పై ముఖ్యమంత్రిని నిలదీసింది. ధుబ్రి జిల్లాకు చెందిన అఫ్రోజా ఖాతున్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్తను, తండ్రిని విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. తనకు 19ఏళ్లు వచ్చాయే వివాహమైందని, 1999లోనే తనకు వివాహమైందని, 2018లో తనకు వివాహమైందని, అప్పటి చట్టం ప్రకారం తాను మేజర్ అయ్యేకే పెళ్లైందని వెల్లడించింది. అయితే ఆమె భర్తను, తండ్రిని కోర్డుకు తీసుకువెళ్లిన అనంతరం సదరు మహిళ కుప్పకూలిపోయింది. అడపాదడపా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. నాలుగు రోజులుగా బాల్యవివాహాలను ప్రోత్సహిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటోన్న పోలీసులు ఇప్పటి వరకూ 2441 అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా బాల్య వివాహాలపై 4,074 కేసులు నమోదవ్వడంతో ఈ అరెస్ట్ లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇకపై మరిన్ని అరెస్ట్ లు తప్పవు అంటూ హిమంతబిశ్వ శర్మ ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story