గిన్నిస్‌కు ఎక్కిన అస్సాం నృత్యం

గిన్నిస్‌కు ఎక్కిన అస్సాం నృత్యం
అస్సాం సాంప్రదాయ నృత్యం బిహూ డ్యాన్స్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది

అస్సాం సాంప్రదాయ నృత్యం బిహూ డ్యాన్స్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. ఒకే వేదికపై 11వేల 304 మంది కళాకారులు బిహూ నృత్యాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. గువాహటిలోని సరుసజై స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాంప్రాదాయ వాయిద్యాలైన ధోల్‌, తాల్‌, గోగోనా, టోకా, పెపా వంటివాటిని వాయించే సంగీత కళాకారులు పాల్గొన్నారు. అస్సాం సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మాస్టర్‌ ట్రైనర్లు, డ్యాన్సర్లతోసహా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి 25 వేలు చొప్పున ప్రభుత్వం గ్రాంట్‌గా ఇవ్వనుంది.

Tags

Read MoreRead Less
Next Story