ఆడి R8 యజమాని.. స్విగ్గీ డెలివరీ బాయ్‌గా..

ఆడి R8 యజమాని.. స్విగ్గీ డెలివరీ బాయ్‌గా..
ఇద్దరూ స్విగ్గీ టీ-షర్టులను ధరించి, స్విగ్గీ బాక్స్ తీసుకుని బయలు దేరుతారు కస్టమర్లకు ఇవ్వడానికి.

ఖరీదైన ఆడి కారుంచుకుని స్విగ్గీ బాయ్‌గా ఫుడ్ డెలివరీ చేయడం ఏమిటి. అతడికి ఏమైనా పిచ్చా అనుకుంటున్నారు కదూ.. అక్కడికే వస్తున్నా.. అతనో వ్లాగర్. వెరైటీగా ఏదో ఒకటి చేసి వీడియో తీయాలి. దాన్ని అప్ లోడ్ చేసి లక్షల్లో వ్యూస్ సంపాదించుకోవాలి. వ్లాగర్ అయినా స్విగ్గీ డెలివరీ బాయ్‌గా బైక్ మీద వెళ్లి పుడ్ అందిస్తుంటాడు. కానీ ఈసారి అభిమానుల కోరిక మేరకు తనకు ఉన్న స్పోర్ట్స్ ఆడి కారుని ఫుడ్ డెలివరీ చేసేందుకు ఉపయోగించాడు.

ఆడి R8 యజమాని అయినా.. స్విగ్గీ డెలివరీ బాయ్‌గా.. ఖాళీగా ఉండడం ఎందుకనుకున్నాడో ఏమో ఎంచక్కా స్విగ్గీ డెలివరీ బాయ్‌గా కారులో కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ అందిస్తున్నాడు. ఇంతకు ముందు బైక్ మీదే వెళ్లే వాడట. కస్టమర్లు కారు ఉంది కదా. అందులో రావచ్చు కదా అంటే. అవును కదా ఈ ఐడియా ఏదో బానే ఉంది. పైగా ఎండలో ఇబ్బంది పడక్కర్లేదు, వర్షానికి తడవక్కర్లేదు అనుకున్నాడు. వెంటనే ఆచరణలో పెట్టి కారులో వెళ్లి ఫుడ్ అందిస్తున్నాడు.

తన యూట్యూబ్ ఛానెల్ YPM Vlogs కోసం తాను ఫుడ్ ఆర్డర్ చేస్తున్న వీడియోను అందులో పోస్ట్ చేశాడు. వ్లాగర్ కారులో అతనితో మరో వ్యక్తిని కూడా తీసుకువెళతాడు. ఇద్దరూ స్విగ్గీ టీ-షర్టులను ధరించి, స్విగ్గీ బాక్స్ తీసుకుని బయలు దేరుతారు కస్టమర్లకు ఇవ్వడానికి.

వీడియోలో వ్లాగర్ ఉపయోగిస్తున్న ఆడి R8 అన్ని విధాలుగా శక్తివంతమైన కారు. ఇది ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో లేదు కానీ, వాటిలో కొన్ని ఉపయోగించిన కార్ల మార్కెట్లో కనిపిస్తాయి. ఇది 5.2 లీటర్ వి 10 ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 525 బిహెచ్‌పి మరియు 530 ఎన్ఎమ్ పీక్ టోక్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఉంది.



Tags

Read MoreRead Less
Next Story