బాబ్రీ కూల్చివేత కేసు.. నిందితులంతా నిర్థోషులే

బాబ్రీ కూల్చివేత కేసు.. నిందితులంతా నిర్థోషులే
సుమారు మూడు దశాబ్ధాలుగా సంచలనం రేపుతున్నబాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో ల‌క్నోలోని సీబీఐ కోర్టు తుది తీర్పును

సుమారు మూడు దశాబ్ధాలుగా సంచలనం రేపుతున్నబాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో ల‌క్నోలోని సీబీఐ కోర్టు తుది తీర్పును వెలువ‌రించింది. మ‌సీదు కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని.. ఈ కేసులో నిందితులుగా ఉన్న‌వారంతా నిర్దోషులే అంటూ న్యాయ‌మూర్తి తీర్పునిచ్చారు. సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ 2000 పేజీలు ఉన్న తీర్పు కాపీనీ చదివి తీర్పు వెలువరిచారు. సీబీఐ సమర్పించిన చాలా ఆధారాలు పరిశీలించి.. వాటి మూలంగా నిందితుల‌ను దోషుల‌గా తేల్చ‌లేమ‌ని కోర్టు చెప్పింది. నిందితుల‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయ‌ప‌డింది.

ఈ కేసులలో మొత్తం 48 మంది మీద అభియోగాలు నమోదుకాగా.. ఇందులో 16 మంది మరణించారు. మిగతా 32 మంది సెప్టెంబర్ 30న కోర్టు ఎదుట హాజరుకావాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇందులో కేంద్రమాజీ మంత్రి ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ కరోనా సోకడంతో హాజరుకాలేక పోయారు. వయోబారం కారణంతో మురళీ మనోహర్ జోషి, ఎల్ కే అద్వాణీలు హాజరు కాలేదు. 26 మంది కోర్టు ముందుకు హాజరైయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story