నేడు వెలువడనున్న బాబ్రీ మసీదు కేసు తీర్పు

నేడు వెలువడనున్న బాబ్రీ మసీదు కేసు తీర్పు
బాబ్రీ మసీదు కేసులలో బుధవారం తుది తీర్పు వెలువడనుంది. 1992 డిశంబర్ లో ఈ మసీదు నేలమట్టం అయిన తరువాత ఇప్పటివరకూ

బాబ్రీ మసీదు కేసులలో బుధవారం తుది తీర్పు వెలువడనుంది. 1992 డిశంబర్ లో ఈ మసీదు నేలమట్టం అయిన తరువాత ఇప్పటివరకూ ఈ కేసు విచారణ జరుగుతూ వచ్చింది. సుదీర్థ విచరాణ అనంతరం సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్ కే యాదవ్ తీర్పు ప్రకటించారు. ఈ కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఎల్‌కే అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ సహా తదితరులు నిందితులు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు ఇప్పటికే మరణించారు. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన 32 మందిని సెప్టెంబర్ 30న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఈ నెల 16న న్యాయస్థానం ఆదేశించింది. అయితే, ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ కరోనా సోకడంతో చికిత్స పొందుతున్నారు. అటు, అద్వాణీ, మురళీ మరోహర్ జోషి వయసు రీత్యా ఈ కరోనా సమయంలో హాజరుకాలేమని న్యాయస్థానానికి కోరారు. అయితే, రెండు మతాలకు చెందిన అత్యంత సున్నితమైన అంశంపై ఈ రోజు తీర్పు వెలువుడుతుంది.. కనుక అల్లర్లు చెలరేగే అవకాశం కనిపిస్తుంది. దీంతో, రాష్ట్రాలు అనుమానిత ప్రాంతాల్లో తీర్పును వెలువరిచింది.

Tags

Read MoreRead Less
Next Story