Bengaluru: ట్రాఫిక్ జామ్... పెళ్లికొడుకు జంప్...

Bengaluru: ట్రాఫిక్ జామ్... పెళ్లికొడుకు జంప్...
పెళ్లైన రెండో రోజే పెళ్లికొడుకు పరారీ; ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కారు దిగి పారిపోయిన వరుడు...

సాధారణంగా ట్రాఫిక్ జామ్ అంటే ఎవరికైనా చిరాకే వస్తుంది. కానీ ఆ కొత్త పెళ్లికొడుకుకు మాత్రం అదో వరంగా మారింది. పెళ్లైన మరుసటి రోజే భార్యను వదిలించుకున్న పారిపోయేందుకు ఉపకరించింది. ఈ విడ్డూరం బెంగుళూరులో చోటుచేసుకుంది. చిక్ బళ్లాపూర్ జిల్లాలోని చింతామణికి చెందిన వ్యక్తికి ఇటీవలే వివాహమైంది. అయితే వివాహానికి ముందే మరో యువతితో అతడు ప్రేమ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి తమ ఇద్దరి ఫొటోలను, వ్యక్తిగత వీడియోలను బయటపెడతానని బెదిరిస్తోంది. అయితే ఈ విషయంలో వరుడి కుటుంబ సభ్యులతో సహా, నవ వధువు సైతం అతడి వెన్నెంటే నిలబడ్డారు. ఆమె ఏం చేసినా తమకు ఏ అభ్యంతరం లేదని హామీ ఇచ్చారు. అయినప్పిటీ వరుడి మనసు కుదుటపడలేదు. అతికష్టం మీద వివాహం అయితే చేసుకున్నాడు. కానీ, మరుసటి రోజు కొత్త భార్యతో కలసి చర్చికి వెళ్లి తిరిగి వస్తుండగా మహదేవపురలో ట్రాఫిక్ జామ్ అయింది. కారు ముందర సీటులో కూర్చుకున్న వరుడు ఉన్నట్లుండి కారు దిగి పరుగు లంకించుకున్నాడు. దీంతో విస్తుపోయిన నవ వధువు తాను కూడా కారు దిగి అబ్బాయిని వెంబడించింది. కానీ, అతడు చిక్కకుండా తప్పించుకున్నాడు. దీంతో చేసేది లేక మార్చ్ 5వ తారీఖున వధువు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదు చేసింది. పోలీసులు వరుడి కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story