లీవ్ లెటర్‌లో భార్య గురించి రాయడంతో అధికారులు అతడిని..

లీవ్ లెటర్‌లో భార్య గురించి రాయడంతో అధికారులు అతడిని..
లీవ్ లెటర్ అంతా బాగానే రాసి చివరి రెండు లైన్లు భార్య గురించి రాసి అడ్డంగా బుక్కయ్యాడు.

బామ్మర్థి పెళ్లికి వెళ్లాలి.. లీవ్ ఇవ్వండి సార్.. లేకపోతే నా భార్య నన్ను చంపేస్తుంది అని లీవ్ లెటర్‌‌లో రాసుకొచ్చాడు.. అంతే ఆ లీవ్ లెటర్ చూసి సదరు కానిస్టేబుల్‌కి లీవ్ ఇవ్వకపోగా, పనిష్మెంట్ విధిస్తూ అతడిని పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారు.

ఫలానా రోజున లీవ్ కావాలి అని అడగొచ్చుగా.. మధ్యలో భార్య ప్రస్తావన ఎందుకు.. ఆమెని విలన్‌ని చేయడం ఎందుకు.. అని మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న దిలీప్ కుమార్ అహిర్వార్‌కి లీవ్ ఇవ్వం పొమన్నారు అధికారులు. లీవ్ లెటర్ అంతా బాగానే రాసి చివరి రెండు లైన్లు భార్య గురించి రాసి అడ్డంగా బుక్కయ్యాడు. బావమరిది పెళ్లికి హాజరు కాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నా భార్య హెచ్చరించింది అని లెటర్‌లో రాసుకొచ్చాడు.

ఈ లేఖ చూసిన సీనియర్ ఆఫీసర్ ఇర్షాద్ వాలీ.. దాన్ని క్రమశిక్షణారాహిత్యంగా భావించారు.. సెలవు ఇవ్వలేదు.. పైగా మరో డిపార్ట్‌మెంట్‌కి బదిలీ చేశారు. అయ్యో రామ వాస్తవం రాయడం తప్పా అని నెత్తీ నోరు మొత్తుకుంటున్నాడు.. మీరైనా చెప్పండి నే చేసిన తప్పేంటో అని సోషల్ మీడియాలో తను రాసిన లెటర్‌ని పోస్ట్ చేసి నెటిజన్లను అడుగుతున్నాడు. దీంతో ఈ లెటర్ వైరల్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story