ఇంజనీరింగ్ చదివి.. రాత్రిళ్లు రోడ్ల మీద ఐస్ క్రీమ్ అమ్మి: అవినాష్

ఇంజనీరింగ్ చదివి.. రాత్రిళ్లు రోడ్ల మీద ఐస్ క్రీమ్ అమ్మి: అవినాష్
నటుడవ్వాలనే కోరికతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న విషయాలను ప్రస్తావించాడు.

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్ అవినాష్ విన్నర్ అవ్వకపోయినా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. హౌస్ లోని వారందరినీ నవ్విస్తూ అందరికీ ఆప్తమిత్రుడయ్యాడు. హౌన్ నుంచి బయటకు వచ్చిన అవినాష్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు. మాటల మధ్యలో నటుడవ్వాలనే కోరికతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న విషయాలను ప్రస్తావించాడు.

ఇంజనీరింగ్ పూర్తి చేసినా నటుడవ్వాలనే కోరికతో యాక్టింగ్ స్కూల్లో జాయినయ్యాడు. అయితే అక్కడ స్టూడెంట్ నుంచి టీచర్‌గా ఎదిగిన విషయాన్ని వివరిస్తూ డబ్బులు సరిపోక పోవడంతో పార్ట్‌టైమ్ జాబులు అనేకం చేసినట్లు చెప్పాడు. ఒక నెల రోజులు కిరాణా షాపులో, మరొక సారి ఆఫీస్ బాయ్‌గ ఇలా ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ చేసేవాడినని చెప్పాడు. ఇంట్లో వాళ్లని డబ్బులు అడగడం ఇష్టం ఉండేది కాదు.

దాంతో రాత్రిళ్లు రోడ్ల మీద ఐస్ క్రీమ్ అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయన్నాడు. అయితే ఎప్పుడూ వాటిని కష్టాలుగా భావించలేదు. టార్గెట్ రీచ్ అవ్వాలనుకున్నప్పుడు అవాంతరాలు ఎదురైనా అధిగమించాలని అన్నాడు. లాక్డౌన్ సమయంలో ఇంటికి ఈఎమ్‌ఐ కట్టుకోలేని పరిస్థితి.

ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. అనుకోకుండా బిగ్ బాస్ ఇచ్చిన అవకాశం అవినాష్ కెరీర్‌ని నిలబెట్టింది. ఫైనల్స్ జరిగే రోజున దర్శకుడు అనిల్ రావిపూడి స్టేజి మీద మెచ్చుకున్నారు టైమింగ్ బావుందంటూ.. ఒకసారి ఆఫీస్‌కి వచ్చి కలవమన్నారు. అనిల్ రావిపూడి నుంచి కాల్ వస్తుందని ఆశిస్తున్నాడు. మరో పక్క అవినాష్, అరియానాతో కలిసి మా టీవీ ఓ షో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story