Top

బిగ్‌బాస్ 4: అరియానా అందుకునేది ఎంతో తెలుసా.. వారానికి..

ఆమె తన ప్రత్యేకమైన యాంకరింగ్ నైపుణ్యాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలు.

బిగ్‌బాస్ 4: అరియానా అందుకునేది ఎంతో తెలుసా.. వారానికి..
X

అందమైన, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి అరియానా. బిగ్‌బాస్ 4లో ఉన్న ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్.. హైదరాబాద్‌కు చెందిన ఆమె 2015 టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అరియానా తను చేసిన ప్రముఖుల వీడియోలు, ఇంటర్వ్యూలను యూట్యూబ్ ఛానెల్‌లో క్రమం తప్పకుండా అప్‌లోడ్ చేస్తుంది.

ఆమె తన ప్రత్యేకమైన యాంకరింగ్ నైపుణ్యాలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలు. చిన్నతనం నుండి యాంకరింగ్, జర్నలిజం వైపు మొగ్గు చూపిన అరియానా ఎల్లప్పుడూ అదే వృత్తిలో కొనసాగాలని కోరుకుంటుంది. తండ్రి వ్యాపారవేత్త, తల్లి గృహిణి. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. జంతు ప్రేమికురాలు అయిన అరియానాకు డ్యూక్ అనే పెంపుడు కుక్క ఉంది. 2018 లో, ఆమె తన సొంత డబ్బుతో హ్యుందాయ్ కారును కొనుక్కుంది.

బిగ్‌బాస్ 4 ఆమెకు వచ్చిన మరో అద్భుత అవకాశం. ఇక్కడకు ఆడటానికే వచ్చాము. అందుకోసం చివరి వరకు ప్రయత్నించాలి. గెలవకపోయినా ప్రయత్నించి ఓడిపోయామన్న సంతృప్తి అయినా మిగులుతుంది అని అంటుంది. మొదటి నుంచి అదే తీరుగా వ్యవహరిస్తుంది. ఫోకస్ అంతా ఆట మీదే ఉంటుంది. ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవదు. ఎలాంటి ఎఫైర్లు పెట్టుకోదు. ఆటలో భాగంగా అవినాష్ ఫీలైతే కూడా అతడిని డల్ అవకుండా తన మాటలతో ఆటలో కొనసాగేందుకు ఉత్సాహాన్నిచ్చింది.

ఇక హౌస్‌లో అరియానా స్పందిస్తున్న తీరు బిగ్‌బాస్‌ని సైతం ఆకట్టుకుంది. ఇంతకీ ఆమె రెమ్యునరేషన్ ఎంతనే టాపిక్ చర్చకు వచ్చింది సోషల్ మీడియాలో. వారానికి లక్షకు పైనే దాదాపు రెండు లక్షలు అందుకొంటున్నట్లు సమాచారం. మిగిలిన కంటెస్టెంట్స్‌తో పోల్చితే ఇది తక్కువే అయినప్పటికీ, తన కెరీర్‌కి ఈ షో మంచి వేదిక అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆడియన్స్ నుంచి కూడా అరియానాకు మంచి మార్కులే వస్తున్నాయి.

Next Story

RELATED STORIES