Three Farm Laws : వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Three Farm Laws :  వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
Three Farm Laws : మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఆమోదం తెలిపారు.

Three Farm Laws : మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి సంతకంతో కేంద్రం గతంలో తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియ పూర్తయ్యింది. కాగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే (సోమవారం) ఈ మూడు చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రవేశపెట్టారు. లోక్ సభ, రాజ్యసభలో ఎలాంటి చర్చలు లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది. కాగా కొత్తగా ఈ చట్టాలను రద్దు చేయాలనీ కోరుతూ ఏడాది పాటుగా ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్‌, హరియాణా, యూపీ రైతులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో గత నెల (నవంబర్ 19) న జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ శీతాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story