అయిదేళ్ల బాలుడు అమ్మని..

అయిదేళ్ల బాలుడు అమ్మని..
అయిదేళ్ల బాలుడు చేసిన సాహసం అతడిని ఇంటర్నెట్‌లో హీరోని చేసింది. బాలుడి చురుకైన ఆలోచన అతడి తల్లి ప్రాణాలను కాపాడటానికి

అయిదేళ్ల బాలుడు చేసిన సాహసం అతడిని ఇంటర్నెట్‌లో హీరోని చేసింది. బాలుడి చురుకైన ఆలోచన అతడి తల్లి ప్రాణాలను కాపాడటానికి సహాయపడింది. యూకెలోని వెస్ట్ మెర్సియా పోలీసులు గత నెలలో ఈ సంఘటన జరిగిందని వివరించారు. జోష్ అనే బాలుడు తన తల్లి, సోదరుడితో కలిసి ఉంటున్నాడు. ఓ రోజు ఉన్నట్టుండి తల్లి కింద పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. జోష్ కి ఓ నిమిషం ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మని లేపడానికి ప్రయత్నించాడు, కానీ లేవట్లేదు. దాంతో వెంటనే తను ఆడుకుంటున్న బొమ్మల మీద అంబులెన్స్ నెంబర్ 112 చూసి ఆ నంబర్‌కు ఫోన్ చేశాడు.

అంబులెన్స్ రావడం ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడం క్షణాల్లో జరిగిపోయింది. ఫోన్ చేసింది ఎవరో తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు. అయిదేళ్ల చిన్నారికి ఆ ఆలోచన రావడం నమ్మశక్యంగా లేదన్నారు. "అతడు చాలా ధైర్యవంతుడు. ఫోన్ రాగానే మా సిబ్బంది ఇంటికి చేరుకుని బాలుడి తల్లికి సకాలంలో వైద్య సహాయం అందేటట్లు చూసుకోగలిగాము. భవిష్యత్తులో అతను ఒక తెలివైన పోలీసు అధికారిని అవుతాడని అధికారులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story