రోజుకు మూడు సార్లు బ్రష్.. గుండె వ్యాధుల రిస్క్‌ని..

మన నోటిలోని బ్యాక్టీరియా మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక కోణాలకు కీలకం. నోటి బ్యాక్టీరియాలో ప్యాంక్రియాటిక్ మరియు ఎసోఫాగియల్ క్యాన్సర్ ప్రమాదాన్ని సూచించే సమాచారాన్ని పరిశోధకులు కనుగొన్నారు. మరి కొన్ని అధ్యయనాలు నోటి పరిశుభ్రతను శ్వాసకోశ సమస్యలతో ముడిపెట్టాయి. తాజా అధ్యయనాలు నోటి ఆరోగ్యం.. హృదయ ఆరోగ్యం మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది.
ఉదాహరణకు, కొన్ని అధ్యయనాలు స్ట్రోక్‌కు అత్యవసర చికిత్స పొందుతున్న వ్యక్తుల రక్తం గడ్డకట్టడంలో నోటి బ్యాక్టీరియా కీలక పాత్ర పోసిస్తుందని కనుగొన్నారు. తీవ్రమైన చిగుళ్ళ వ్యాధి రక్తపోటుకు సంకేతం. ఆహారం తిన్న వెంటనే పుక్కిలించడం వంటివి చేయడంతో పాటు రోజుకు మూడు సార్లు బ్రష్ చేయమంటున్నారు కార్డియాలజిస్టులు. కనీసం రెండు సార్లైనా ఉదయం ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు మరోసారి బ్రష్ చేస్తే నోరు పరిశుభ్రంగా ఉండడంతో పాటు గుండె వ్యాధులను నిర్మూలించవచ్చని నిపుణులు జరిపిన పరిశోధనల్లో తేలింది.
దక్షిణ కొరియాలోని కొరియన్ నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ సిస్టమ్ 40 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసున్న 1,61,286 మందిపై సైంటిస్టులు 10.5 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఆ సమయంలో వారికున్న అనారోగ్య సమస్యలు, జీవన విధానం, నోటి ఆరోగ్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని పరిశోధనలు చేశారు. నిత్యం రెండు సార్లు బ్రష్ చేసుకునే వారికి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు 12 శాతం వరకు తగ్గాయని, మూడు సార్లు బ్రష్ చేసుకుంటే గుండె భద్రంగా ఉంటుందని, ఆట్రియల్ ఫైబ్రిలేషన్ వంటి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు 10 శాతం తక్కువగా ఉన్నాయని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com