ఇల్లు కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి..

ఇల్లు కొనాలంటే డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి..
సుమారుగా 15 సంవత్సరాలు లోన్ పీరియడ్ అనుకుంటే దానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోవాలి.

గృహ రుణాలు ఇస్తామంటూ బ్యాంకులు వెంట పడుతుంటాయి. కస్టమర్లను ఊరిస్తుంటాయి. మన దగ్గర కొంత ఉన్నా ఇల్లు కొనాలంటే లోనుకు వెళ్లక తప్పని పరిస్థితి. మరి బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలంటే ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి అనేది ఒక అవగాహన ఉండాలి. డౌన్ పేమెంట్ మొత్తాన్ని పొదుపు చేసుకోవాలనుకుంటే ముందు మీరు తీసుకోబోయే ఇంటి విలువ, ఎన్నేళ్లు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు అనే విషయాలు నిర్ణయించుకోవాలి.

సుమారుగా 15 సంవత్సరాలు లోన్ పీరియడ్ అనుకుంటే దానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో ప్రాపర్టీకి ఎంత ధర ఉందో తెలుసుకోవాలి. ద్రవ్యోల్బణం కారణంగా ప్రాపర్టీ ధర 15 సంవత్సరాల్లో మరింత పెరగొచ్చు. 5 శాతం పెరిందనుకుంటే ఇప్పుడు రూ.40 సంవత్సరాలు ఉన్న ప్రాపర్టీ 15 సంవత్సరాల తరువాత రూ.83 లక్షలు అవుతుంది. 15 శాతం డౌన్‌పేమెంట్ చేయాలనుకుంటే 15 సంవత్సరాలలో రూ.12.5 లక్షలు నిధిని సమకూర్చుకోవాలి. దీనిని బట్టి ప్రణాళికలు వేసుకుని నెలకు రూ.3,600 సిప్ చేస్తే 15 సంవత్సరాల్లో రూ.12.5 లక్షలు జమ అవుతుంది.

12 శాతం రాబడినిచ్చే సాధనాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే నెలకు రూ. 2,500 పెట్టుబడులు పెడితే సరిపోతుంది. మీ కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి ఇల్లు కొనడాన్ని మీ లక్ష్యాంగా పెట్టుకోవాలి. అందుకు ఆర్థిక నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. భద్రతకు భరోసానిచ్చే పండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు మార్గ నిర్ధేశం చేస్తారు. అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించేందుకువీలవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story