దీపావళి టపాసులు అక్కడ కొంటే మీరు మహానుభావులే!

దీపావళి టపాసులు అక్కడ కొంటే మీరు మహానుభావులే!

వెలుగులు విరజిమ్మే దీపావళి పండగ అంటే చిన్నా పెద్దా అందరికీ ఉత్సాహమే. దీపాల వెలుగులో మిరుమిట్లు గొలుపుతూ ఇల్లంతా శోభాయమానంగా ఉంటుంది. ఈ పండగ సందర్భంగా ఇంటిల్లిపాదీ టపాకాయలు పేల్చుతూ తెగ సంబరపడిపోతారు. అయితే దీపావళికి చైనాలో తయారైన బాణసంచా మనదేశంలో విపరీతంగా అమ్మకాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా సరుకులను బహిష్కరించాలని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీపావళి సందర్బంగా ఎట్టిపరిస్థితుల్లోనూ చైనాకు చెందిన బొమ్మలు, టపాసులు వంటి వాటిని కొనుగోలు చేయవద్దంటూ నెటిజన్లు పిలుపునిస్తున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో చాలమంది చిన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని.. వారిలో అనేకమంది ఇప్పుడు దీపావళి సామగ్రిని విక్రయిస్తూ పొట్టపోసుకోవాలని అనుకుంటున్నారని.. వారి వద్ద మాత్రమే పండుగ సామగ్రిని కొని చేయూత ఇవ్వాలని కోరుతున్నారు. చైనా ఉత్పత్తులు కొనడం వల్ల దేశానికే కాకుండా.. ఎంతో మంది పేదలకు కూడా అన్యాయం చేసిన వాళ్లమవుతామంటూ నెటిజన్లు అనేక ట్వీట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగానే 'హిందూ దీపావళి.. హిందూ సామాన్' అనే హ్యాష్‌ట్యాగ్‌ను సైతం ట్రెండ్ చేస్తున్నారు.

అటు దీపావళి పండుగవేళ దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశీయ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇక్కడి తయారీదారుల్లో నమ్మకం పెరుగుతుందని అన్నారు. తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధిలో వారిని కూడా ప్రోత్సహించినట్లవుతుందని మోదీ పేర్కొన్నారు.

మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమవుతున్న పరిస్థితుల్లో.. ఈ నెల 9 నుంచి 30 వరకు బాణసంచా కాల్చడంపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ నిషేధం విధించింది. నేషనల్ కేపిటల్ రీజియన్-ఢిల్లీ పరిధిలో వచ్చే రాష్ట్రాల్లోనూ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఇప్పటికే ఢిల్లీ సహా హర్యానా, రాజస్థాన్, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, కర్నాటక వంటి రాష్ట్రాల్లో.. బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాయి. వాయు కాలుష్యం ఓ మోస్తరుగా ఉన్న ప్రాంతాలు, రాష్ట్రాల్లో గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతిచ్చింది NGT. అదికూడా కేవలం 2 గంటలపాటు మాత్రమే కాల్చాలని NGT సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story