Top

పదవతరగతి పాసైన విద్యార్థులకు స్కాలర్‌షిప్.. అప్లైకి ఆఖరు..

విద్యార్థినులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నారు.

పదవతరగతి పాసైన విద్యార్థులకు స్కాలర్‌షిప్.. అప్లైకి ఆఖరు..
X

టెన్త్ పాసయిన విద్యార్థినులకు సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సీబీఎస్‌ఈ స్కూల్ అనుబంధ పాఠశాలల్లో పదో తరగతి పాసైన విద్యార్థినులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థినులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నారు.

అర్హత కలిగిన విద్యార్థినులు సీబీఎస్‌ఈ అధికారికి వెబ్‌సైట్ https://cbse.nic.in/ లో రిజిస్టర్ చేసుకోవాలని బోర్డు సూచించింది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డిసెంబర్ 10 చివరితేది. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారు డిసెంబర్ 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ చేసుకునే వారు మాత్రం హార్డ్ కాపీని డిసెంబర్ 28 కల్లా పంపించాలి.

నిబంధనలు:

దరఖాస్తు చేసుకునే విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక సంతానం అయి ఉండాలి.

సీబీఎస్ఈలో పదవతరగతి 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.

సీబీఎస్ఈ బోర్డు అనుబంధ విద్యాసంస్థలోనే 11,12 తరగతులను చదువుతుండాలి.

టెన్త్‌లో ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500 మించి ఉండకూడదు.

Next Story

RELATED STORIES