గుడ్‌న్యూస్‌: కొవాగ్జిన్‌కూ సీడీఎస్‌సీవో అనుమతి

గుడ్‌న్యూస్‌: కొవాగ్జిన్‌కూ సీడీఎస్‌సీవో అనుమతి
కరోనా నిరోధానికి భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన ‘కొవాగ్జిన్‌' టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) అనుమతిచ్చింది.

కరోనా నిరోధానికి భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన 'కొవాగ్జిన్‌' టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) అనుమతిచ్చింది. శుక్రవారం సీరమ్ సంస్థ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ కు అనుమతి లభించింది. దీంతో ఈ టీకా వినియోగానికి సీడీఎస్‌సీవో సిఫారసు చేసింది. వీటిపై డీసీజీఐ త్వరలోనే ఓ నిర్ణయం ప్రకటించనుంది. సానుకూల నిర్ణయం అనంతరం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు సిఫార్సు చేసిన మరుసటి రోజే కొవాగ్జిన్‌కూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story