Boiled Rice : బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం మరోసారి క్లారిటీ

Boiled Rice : బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం మరోసారి క్లారిటీ
Boiled Rice : బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. బాయిల్డ్ రైస్ సేకరించమని.. అవసరాలకు కావాలనుకుంటే ఆయా రాష్ట్రాలే సేకరించుకోవాలని తేల్చి చెప్పింది.

Boiled Rice : బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. బాయిల్డ్ రైస్ సేకరించమని.. అవసరాలకు కావాలనుకుంటే ఆయా రాష్ట్రాలే సేకరించుకోవాలని తేల్చి చెప్పింది. పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సమాధానం ఇచ్చారు. కేంద్రం తరుపున బాయిల్డ్ రైస్ సేకరించేది లేదన్నారు. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్‌ను తీసుకునేది లేదని గత ఖరీఫ్ సీజన్‌లోనే రాష్ట్రాలకు స్పష్టం చేశామన్నారు. 2020-21 ఖరీఫ్ సీజన్‌లో 47.49 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్, 6.33 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్‌ను సేకరించామని సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం బాయిల్డ్ రైస్‌ను కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story