కరోనా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం..!

కరోనా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం..!
కేంద్ర ప్రభుత్వం కరోనా నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏప్రిల్ నెల చివరి వరకు ఈ నిబంధనలు కొనసాగనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం కరోనా నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏప్రిల్ నెల చివరి వరకు ఈ నిబంధనలు కొనసాగనున్నాయి. టెస్ట్, ట్రాక్, ట్రీట్ ప్రొటోకాల్ పాటించాలని.. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

కంటైన్మెంట్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు తక్కువగా ఉన్న రాష్ట్రాలలో 70 శాతానికి పెంచేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తులను సమర్థవంతంగా ఐసోలెట్ చేసి కంటైన్మెంట్ జోన్లను ప్రకటించాలని.. జన సామర్థ్యం అధికంగా ఉన్న ప్రాంతాలు, కార్యాలయాల్లో కోవిడ్ నిబంధనలను కఠినంగా పాటించాలని తెలిపింది.

మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్ల వినియోగం పెంచాలని.. మాస్క్‌లు లేని వారికి జరిమానా విధించాలని కేంద్రం సూచించింది. అంతరాష్ట్ర రవాణా, ప్రయాణాలపై ఎలాంటి పరిమితి విధించరాదని తెలిపింది. అటు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ పలు రాష్ట్రాలలో మందకొడిగా సాగుతోందని.. కరోనా చైన్ నిలువరించేందుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.

అటు...45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ తప్పని సరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story