పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ జిల్లాల పై కేంద్రం ఫోకస్..!

పెరుగుతున్న కరోనా కేసులు..  ఆ జిల్లాల పై కేంద్రం ఫోకస్..!
కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్రం రంగంలోకి దిగింది. పాజిటివిటీ రేటు 10 శాతం మించి ఉన్న జిల్లాలపై ఫోకస్ పెట్టింది.

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్రం రంగంలోకి దిగింది. పాజిటివిటీ రేటు 10 శాతం మించి ఉన్న జిల్లాలపై ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా 46 జిల్లాలకు హెచ్చరికలు జారీచేసింది. ఏపీతో పాటు పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, అసోం, మిజోరం, మేఘాలయ, మణిపూర్‌లోని మొత్తం 46 జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందంటూ హెచ్చరించింది కేంద్రం. మరో 53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతంగా ఉందని కేంద్రం తెలిపింది. ఈ జిల్లాల్లోని కరోనా రోగులు బయటకి రాకుండా చూడాలని ఆదేశించింది. దీంతో పాటు కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని రాష్ట్రాలకు సూచించింది.

డెల్టా, డెల్టా ప్లస్‌ వేరియంట్లతోనే తలలు పట్టుకుంటుంటే... త్వరలో మరిన్ని వేరియంట్లు పుట్టుకురావొచ్చంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరిక మరింత కలవర పెడుతోంది. కరోనా పట్ల జాగ్రత్తలు మానేసి, భౌతికదూరం, మాస్కులు లేకుండా తిరిగితే.. కరోనా వేరియంట్లు మరింత బలం పుంజుకుంటాయని WHO చెబుతోంది. అజాగ్రత్త కారణంగా కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి.. అందులో నాలుగు రకాలు ప్రమాదకరంగా మారాయని చెప్పుకొచ్చింది. వీటిలో డెల్టా వేరియంట్‌ అత్యంత ప్రమాదకరమని గుర్తించింది. డెల్టా వేరియంట్ కారణంగా.. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి సైతం మళ్లీ కరోనా సోకుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అందుకే, అమెరికాలో రోజువారి కరోనా కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story