టీచర్ ఉద్యోగార్థులకు కేంద్రం శుభవార్త..

టీచర్ ఉద్యోగార్థులకు కేంద్రం శుభవార్త..
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ ఏడేళ్ల నుంచి జీవితకాలం పొడిగించింది.

టీచర్ ఉద్యోగార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ ఏడేళ్ల నుంచి జీవితకాలం పొడిగించింది. ఈ పొడిగింపు 2011 నుండి వర్తిస్తుంది. ఈ శుభవార్తను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటించారు.

ఇప్పటికే ఏడేళ్ల కాలం పూర్తయిన అభ్యర్ధులకు కొత్తగా టీఈటీ సర్టిఫికెట్లు జారీ చేయడానికి లేదా పాత వాటిని రీవ్యాలిడేట్ చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలని రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది.

ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునేవారు టీఈటీలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. 2011 ఫిబ్రవరిలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు టీఈటీని నిర్వహిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story