కరోనా కట్టడికి కేంద్రం మరో కీలక నిర్ణయం..!

కరోనా కట్టడికి కేంద్రం మరో కీలక నిర్ణయం..!
దేశంలో కరోనా ఉధృతి ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పని ప్రదేశాల్లోనే వ్యాక్సిన్ వేసేందుకు అనుమతిచ్చింది.

దేశంలో కరోనా ఉధృతి ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పని ప్రదేశాల్లోనే వ్యాక్సిన్ వేసేందుకు అనుమతిచ్చింది. ఈనెల 11న ప్రారంభం కానున్న పని ప్రదేశాల్లోనే టీకా పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

కనీసం వంద మంది టీకా వేయించుకునేందుకు సిద్ధంగా ఉంటే అక్కడే వ్యాక్సినేషన్ చేపట్టేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కేంద్రం సూచించింది. 45 ఏళ్లు పైబడిన వారందరూ ఆయా పని ప్రదేశాల్లోనే టీకా వేయించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం.

ఈ నెలలో అన్ని రోజులూ టీకా పంపిణీ కొనసాగేలా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story