CM Yogi : ప్రతీ జిల్లాకు రూ.1 లక్ష, యూపీలో నవరాత్రి ఉత్సవాలు

CM Yogi : ప్రతీ జిల్లాకు రూ.1 లక్ష,  యూపీలో నవరాత్రి ఉత్సవాలు
చైత్ర నవరాత్రుల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో రామాయణం, దుర్గా సప్తశతి పారాయణం చేయనున్నారు

చైత్ర నవరాత్రుల సందర్భంగా ఉత్తర ప్రదేశ్ లో తొమ్మిది రోజుల పాటు దుర్గామాత దేవాలయాలు, శక్తిపీఠాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకుగాను అధికారులకు ఆదేశాలు జారీచేశారు యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్. ప్రతీ జిల్లాకు ఒక లక్షరూపాయలను కేటాయించనున్నట్లు తెలిపారు. అధికారులు జారీ చేసిన సర్కులర్ ప్రకారం మార్చి 22న ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రుల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో రామాయణం, దుర్గా సప్తశతి పారాయణం చేయనున్నారు.

వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు రూ.1 లక్ష నిధులను మంజూరు చేసింది. ఉత్సవాలలో భాగంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆలయ ఫొటోలు, భౌగోళిక స్థానాలు, పూజారుల వివరాలు రాష్ట్ర అధికారిక పోర్టల్ లో అప్లోడ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతీ జిల్లాకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఉత్సవాల సమయంలో ప్రదర్శనలు ఇవ్వడానికి కళాకారులను ఎన్నుకునే బాధ్యతను కమిటీ నిర్వహించనుందని చెప్పారు.

మతాన్ని వ్యాపారంగా మారుస్తున్నారని అన్నారు యూపీ మాజీ సీఎం, సమాజ్ వాద్ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు అర్చకులకు గౌరవవేతనం ఇచ్చామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్చకుల వేతనాలను పెంచలేదని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story