మరోసారి కోరలు చాచిన కరోనా.. మినీ లాక్‌డౌన్

మరోసారి కోరలు చాచిన కరోనా.. మినీ లాక్‌డౌన్
ముందు జాగ్రత్త చర్యగా బడులు మూత పడ్డాయి. గత ఏడాది మాదిరిగా సంపూర్ణ లాక్‌డౌన్ విధించడం సాధ్యం కాదు.

ముందు జాగ్రత్త చర్యగా బడులు మూత పడ్డాయి. గత ఏడాది మాదిరిగా సంపూర్ణ లాక్‌డౌన్ విధించడం సాధ్యం కాదు. కనీసం మినీ లాక్‌డౌన్ అయినా విధించాలని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చిన్న చిన్న ఆస్పత్రుల్లోనూ కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మరోసారి పెరుగుతోంది. గురువారం 1,779 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు మరింత పెరిగి 2వేలు కూడా దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది తరహాలోనే పాజిటివ్ కేసులు పెరిగే పరిస్థితులు నెలకొనడంతో ముందు జాగ్రత్తలపై ఆరోగ్యశాఖ దృష్టి సారించింది.

అన్ని నగరాలు, పట్టణ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఐదు వందల పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇప్పటికే నాలుగు వేల పాజిటివ్ కేసులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో చెన్నైలో సోమవారం నుంచి టెస్టుల సంఖ్య పెంచనున్నారు. ఇందుకోసం 16వేల మంది ఆరోగ్య కార్యకర్తలు రంగంలోకి దిగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story