ఖాళీగా ఉన్న ఇంట్లోకి వైరస్..

ఖాళీగా ఉన్న ఇంట్లోకి వైరస్..
ఇన్నాళ్లు నలుగురి మధ్యలోకి వెళితే కరోనా వస్తుందనుకున్నాము. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఇంట్లోకి కూడా వైరస్ చొరబడుతోందని తాజా

ఇన్నాళ్లు నలుగురి మధ్యలోకి వెళితే కరోనా వస్తుందనుకున్నాము. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఇంట్లోకి కూడా వైరస్ చొరబడుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. వాడకుండా వదిలేసిన సింక్, ట్యాప్, షవర్ హ్యాండిల్ పై వైరస్ ఆనవాళ్ళను గుర్తించినట్లు 'చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. టాయిలెట్ ఫ్లష్ వేగానికి వైరస్ పైపుల ద్వారా ఇంట్లోకి చేరినట్లు 'యాన్ ఆన్ సైట్ స్టిమ్యులేషన్ ఎక్స్ పెరిమెంట్' కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్ సోకిన వ్యక్తి యూరినల్స్ లో వైరస్ తీవ్రత అధికంగా ఉంటుందని, అది ఇతర అపార్ట్ మెంట్లకు చేరి, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. బాత్రూమ్ ల వాడకం అత్యంత అవసరమని, అయితే వాటిని సరిగా వినియోగించకపోతే గాలి బిందువుల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని వెల్లడించారు. ఫ్లషింగ్ వల్ల ఇళ్లలో వైరస్ పైభాగానికి ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. నీటి సదుపాయం సరిగా లేని ఇళ్లలో ఈ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుందని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story