CRPF: సీఆర్పీఎఫ్ జవాన్ల కోసం సైకాలజిస్ట్...

CRPF: సీఆర్పీఎఫ్ జవాన్ల కోసం సైకాలజిస్ట్...
అమిత్ షా, ముఖేశ్ అంబానీ వంటి బడా నేతలకు, వ్యాపారవేత్తలకు భధ్రత కల్పించే సీఆర్ఫీఎఫ్ బలగాల కోసం మానసిక వైద్యడు...

సీఆర్పీఎఫ్ జవాన్ల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ప్రత్యేకంగా సేవలు అందించేందుకు గానూ ఓ మానసిక వైద్యుడిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ముఖ్యంగా జాతీయ రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలకు సెక్యురిటీగా వెళ్లే దళాలకు ఈ సేవలు తప్పని సరిగా అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం సెంట్రల్ పారా మిలటరీ ఫోర్స్ లోని ప్రత్యేక వీఐపీ సెక్యూరిటీ వింగ్ కు చెందిన సుమారు 6వేల మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు 110 మంది వీవీఐపీలకు భధ్రత కల్పిస్తున్నారు. వీరిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అస్సామ్ ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ, వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదాని కూడా ఉన్నారు. అయితే ఈ ప్రత్యేక భధ్రతా దళం ఇటీవలే ఓ సైకాలజిస్ట్ కోసం పత్రికా ప్రకటన ఇచ్చింది. వివిధ మానసిక రుగ్మతలకు చికిత్స అందించే సైకాలజిస్ట్ కావాలన్నది ప్రకటన సారాంశం. ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో క్యాంప్ లో పనిచేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగం కోసం ధరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థి క్లీనికల్ సైకాలజీలో గుర్తింపు పొందిన భారత లేద విదేశీ విద్యాలయం నుంచి పట్టభద్రులై ఉండాలని ప్రకటనలో స్పష్టంగా తెలియజేశారు. 40ఏళ్లు లోపు మాత్రమే ఉండాలని, సంబంధిత సబ్జెక్ట్ లో పీహెచ్డీ చేసి ఉండాలన్న నియమాలను పేర్కొంది. నెలసరి ఆదాయం రూ.50వేల నుంచి రూ.60వేల వరకూ ఉంటుందని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story