Odisha : కొడుకులు దూరంగా.. కూతుళ్ళే అన్ని తామై.. తల్లికి దహన సంస్కారాలు..!
Odisha : ఆ తల్లికి ఇద్దరు కొడుకులు.. ఆమె చనిపోయిందని తెలిసిన చివరిచూపు కోసం ఒక్కరు కూడా రాలేదు..

Odisha : ఆ తల్లికి ఇద్దరు కొడుకులు.. ఆమె చనిపోయిందని తెలిసిన చివరిచూపు కోసం ఒక్కరు కూడా రాలేదు.. తోడబుట్టిన అన్నాదమ్ములు తల్లి దహన సంస్కారాలకి రాకపోవడంతో నలుగురు అక్కచెల్లెళ్లు ముందడుగు వేసి అమ్మ అంత్యక్రియలు నిర్వహించారు ఈ ఘటన ఓడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మంగళాఘాట్ ప్రాంతంలో జతి(80) అనే వృద్ధురాలు కన్నుమూసింది.
ఆమెకి ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్ళున్నారు. అందరికి పెళ్ళిళ్ళు చేసింది జతి.. వ్రుద్ధ్యాప్యంలో అండగా ఉండాల్సిన ఆ ఇద్దరు కొడుకులు ఆలనాపాలనా పట్టించుకోవడమే మనేశారు. చివరికి ఆ తల్లి కన్నుమూసిందని తెలిసిన నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఆమెను కడసారి చూసేందుకు కూడా రాలేదు. దీనితో ఆమె నలుగురు కుమార్తెలు సామాజిక ఆంక్షలు తెంచుకుని, తమ తల్లి పాడిని భుజనా ఎత్తుకొని నాలుగు కిలోమీటర్ల మోసి అంత్యక్రియలు నిర్వహించి తల్లి రుణం తీర్చుకున్నారు.
ఈ స్మశాన వాటికలో అంత్యక్రియలు స్వర్గలోక ప్రాప్తికి సోపానంగా స్థానికులు భావిస్తారు. కని, పెంచిన తల్లికి స్వర్గ లోకం ప్రాప్తించాలని ఆ నలుగురు కుమార్తెలు తమ తల్లికి కడపటి వీడ్కోలు పలికారు.
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTPayal Rajput: స్టేజ్పైనే బాయ్ఫ్రెండ్కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
22 May 2022 2:45 PM GMTBalakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్...
22 May 2022 2:13 PM GMT