ఈసారి కళ తప్పనున్న దీపావళి వేడుకలు

ఈసారి కళ తప్పనున్న దీపావళి వేడుకలు

కరోనా దెబ్బకు ఈసారి దీపావళి వేడుకలు కళ తప్పనున్నాయి. అసలే కరోనా.. అందులోనూ సెకండ్ వేవ్.. ఆపై చలికాలం.. ఇవన్నీ క్రాకర్స్ మోతలకు అడ్డుగా నిలవనున్నాయి. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో టపాకాయల వ్యాపారం మందగించింది. ఏపీలోని విశాఖలో క్రాకర్స్ అమ్మకాలు మందగించినా.. ప్రమిదల వ్యాపారం ఊపందుకుంది.

టపాకాయలు భారీగా పేల్చడం వల్ల వాయు కాలుష్యం తీవ్రంగా వస్తుంది. కరోనాకు ఈ కాలుష్యం తోడైతే మళ్లీ కేసులు భారీగా పెరిగే అవకాశముంది. అందుకే ఈ సారి బాణసంచా పేలుళ్లకు దూరంగా ఉండాలని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.

కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే నియంత్రణ పాటించాలని చెబుతున్నారు.

మన బాధ్యతగా అందరూ ఇళ్లలోనే దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story