Delhi : ఢిల్లీని కమ్మేసిన మంచు పొగ

Delhi
Delhi : ఢిల్లీని కమ్మేసిన మంచు పొగ
రికార్డ్‌ స్థాయిలో నమోదవుతున్న అత్యల్ప ఉష్ణోగ్రతలు; చలికి వణికిపోతున్న ప్రజానీకం

ఉత్తర భారతంలో ఎముకలు కొరికే చలి రోజు రోజుకు పెరుగుతుంది. దేశరాజధాని ఢిల్లీని గురువారం ఉదయం మంచు పొగ కమ్మేసింది. గత రెండేళ్లలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో చలి 3 డిగ్రీలు నమోదు అయిందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దీంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు కొన్నిరోజులుగా రోడ్లను కమ్మేయడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీ ఏయిర్‌పోర్టు సిబ్బింది కూడా లో విజబిలిటి ప్రాబ్లమ్‌ ఉందని, కానీ దాని మూలంగా విమాన రాకపోకలకు ఏం ఇబ్బంది కలగడంలేదని వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story