Delhi: కుంగుబాటు... లాయర్ సూసైడ్

Delhi: కుంగుబాటు... లాయర్ సూసైడ్
ప్రాణాంతకంగా మారుతున్న కుంగుబాటు; నోయిడాలో మహిళా న్యాయవాది ఆత్మహత్య

కుంగుబాటు, ఒత్తిడి దేశ యువతను ఛిధ్రం చేస్తోంది. విపరీతమైన మానసిక ఒత్తిడి తాళలేక ప్రాణాలు సైతం తీసుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా ఢిల్లీలోని ఓ యువ న్యాయవాది సైతం ఇదే సమస్యతో ప్రాణాలు తీసుకున్న వైనం కంటతడి పెట్టిస్తోంది.


ఢిల్లీలోని నోయిడాకు చెందిన 27ఏళ్ల లాయర్ తీవ్ర కుంగుబాటుతో బాధపడుతూ తమ 15 అంతస్థుల అపార్ట్మెంట్ మీద నుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియనప్పటికీ ఆమె తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఆమె మందులు కూడా వాడుతోందని తెలుస్తోంది.


నోయిడాలోని సెక్టర్ నంబర్ 63లో సూపర్ టెక్ కేప్ టౌన్ లో కుటుంబంతో కలసి నివశిస్తున్న లాయర్ ఎంతో కలివిడిగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించి, తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story