Delhi: జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

Delhi: జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం
గుట్కా, పాన్‌ మసాలా వంటి ఉత్పత్తుల విషయంలో పన్నుల ఎగవేతను అరికట్టే మార్గాలపై చర్చ

ఢిల్లీలో 49వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం కొనసాగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గుట్కా, పాన్‌ మసాలా వంటి ఉత్పత్తుల విషయంలో పన్నుల ఎగవేత అధికంగా ఉందని... దీన్ని అరికట్టే మార్గాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే జీఎస్టీ అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవచ్చు. తృణ ధాన్యాలతో తయారు చేసే ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించే అవకాశముంది. పెన్సిల్‌ షార్ప్‌నర్లపై ఇపుడు 18 శాతం జీఎస్టీ విధిస్తుండగా, దీన్ని 12శాతానికి తగ్గింవచ్చని వార్తలు వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story