Top

మనుషులా.. మృగాలా.. చిట్టితల్లిపై కామెంట్లు చేయడానికి నోరెలా.. : నెటిజన్స్ ఆగ్రహం

ఆట మీద వ్యామోహం అమాయకపు చిట్టి తల్లిని టార్గెట్ చేసేందుకు వాడుతారా.

మనుషులా.. మృగాలా.. చిట్టితల్లిపై కామెంట్లు చేయడానికి నోరెలా.. : నెటిజన్స్ ఆగ్రహం
X

మనుషులేనా.. ఏం మాట్లాడుతున్నాం.. ఏం చేస్తున్నాం అని కొంచెమైనా ఆలోచిస్తున్నారా.. మంచి చెడు ఆలోచించే విచక్షణ కోల్పోతున్నారు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆన్‌లైన్ ట్రోలింగ్‌కి పాల్పడుతున్నారు.. ఆట మీద వ్యామోహం అమాయకపు చిట్టి తల్లిని టార్గెట్ చేసేందుకు వాడుతారా. జరుగుతున్న ఘటనలు దేశం ఎటు పోతోందో తెలియజేస్తున్నాయి అంటూ పలువురు ప్రముఖులు, నెటిజన్లు ధోనీ కూతురు జీవా పై చేసిన కామెంట్లకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని ఐదేళ్ల కుమార్తెకు సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి అత్యాచారం బెదిరింపులు వచ్చాయి. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సిఎస్‌కె విఫలమైంది. 10 పరుగుల తేడాతో కెకెఆర్‌ చేతిలో ఓడిపోయింది. ధోని భార్య సాక్షికి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు సోషల్ మీడియాలో, ముఖ్యంగా మహిళల నుండి ఆగ్రహాన్ని సృష్టించాయి.

నటి, రాజకీయ నాయకురాలు అయిన నగ్మా ట్వీట్ చేస్తూ, మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇది అసహ్యంగా ఉంది ధోని 5 సంవత్సరాల కుమార్తె జివా.. కెకెఆర్‌, సిఎస్‌కే ఐపిఎల్ మ్యాచ్ తర్వాత రేప్ బెదిరింపులను పొందుతోంది. మిస్టర్ # పిఎం మన దేశంలో ఇది ఏమి జరుగుతోంది? అని పీఎంకి ట్యాగ్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎంపి ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేస్తూ, "సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు ఎలా దుర్వినియోగం అవుతున్నాయనేదానికి ఇది చాలా అసహ్యకరమైన ఉదాహరణ." అభిమానులు తరచూ ఆటగాళ్ళపై తమ కోపాన్ని తీర్చుకుంటారు. మునుపటి రోజుల్లో, వారు ఆటగాళ్ల ఇళ్లపై రాళ్ళు రువ్వారు, పోస్టర్లు తగలబెట్టారు.. ఇప్పడు సోషల్ మీడియా వేదికగా వారి పైశాచికత్వాన్ని ఇలా ప్రదర్శిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా, ఒక క్రీడాకారుడి కుమార్తెను ఈ విధంగా లక్ష్యం చేయడం ఇంతకు ముందు వినలేదు అని అన్నారు.

Next Story

RELATED STORIES