జనతా కర్ఫ్యూలో భారతీయులు ప్రదర్శించిన క్రమశిక్షణ ప్రపంచానికి స్ఫూర్తి : మోదీ

జనతా కర్ఫ్యూలో భారతీయులు ప్రదర్శించిన క్రమశిక్షణ ప్రపంచానికి స్ఫూర్తి : మోదీ
గతేడాది మార్చిలో కరోనా కట్టడికై నిర్వహించిన జనతా కర్ఫ్యూలో భారతీయులు ప్రదర్శించిన క్రమశిక్షణ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు.

గతేడాది మార్చిలో కరోనా కట్టడికై నిర్వహించిన జనతా కర్ఫ్యూలో భారతీయులు ప్రదర్శించిన క్రమశిక్షణ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని మన్ కీ బాత్ లో జాతినుద్దేశించి ప్రసగించారు. ఈ కార్యక్రమం 75 ఎడిషన్లు పూర్తిచేసుకున్న సందర్భంగా శ్రోతలకు ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో కేంద్రం నిర్వహిస్తున్న అజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో యువత పాలుపంచుకోవాలని కోరారు. అలాగే నూతన సాగు చట్టాలపై మరోసారి మోదీ స్పందించారు. ఈ చట్టాలు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాయని మరోసారి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story